Fire Accident : కోల్‌కతాలో సినిమా థియేటర్‌లో అగ్నిప్రమాదం

కోల్‌కతాలో సినిమా థియేటర్‌లో అగ్నిప్రమాదం  సంభవించింది. ఈ ఘటనలో ఇద్దరు గాయపడ్డారు. థియేటర్‌  మూసి ఉండటంతో పెను ప్రమాదం తప్పింది. 15 ఫైరింజన్లు ఘటనా స్ధలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చాయి.

Fire Accident : కోల్‌కతాలో సినిమా థియేటర్‌లో అగ్నిప్రమాదం

Fire Accident At Closed Cinema Hall

Fire Accident : కోల్‌కతాలో సినిమా థియేటర్‌లో అగ్నిప్రమాదం  సంభవించింది. ఈ ఘటనలో ఇద్దరు గాయపడ్డారు. థియేటర్‌  మూసి ఉండటంతో పెను ప్రమాదం తప్పింది. 15 ఫైరింజన్లు ఘటనా స్ధలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చాయి.

కోల్‌కతా‌లోని లేక్ టౌన్ ప్రాంతంలో ఉన్న “మినీ జయ” సినిమా హాలులో రాత్రి గం.9-15 సమయంలో మంటలు వ్యాపించాయి. లాక్ డౌన్ కారణంగా సినిమా హాల్ మూసి ఉంది. సినిమాహాల్ పై భాగంలో వాచ్‌మెన్ కుటుంబం నివసిస్తోంది. శుక్రవారం రాత్రి వాచ్‌మెన్  భార్య కట్టెల పొయ్యిపై వంట చేస్తుండగా ఈ దుర్ఘటన జరిగినట్లు ప్రాధమికంగా అంచనా వేశారు.

ఈ ప్రమాదంలో ఆమె తీవ్రంగా గాయపడింది.  ఆమెను రక్షించే క్రమంలో వాచ్‌మెన్ కు గాయాలయ్యాయి. ఇద్దరినీ సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆ ప్రాంతంలో నివసించే అగ్నిమాపకశాఖ మంత్రి సుజిత్ బోస్  ఘటనా స్ధలానికి వచ్చి పరిస్ధితిని సమీక్షించారు.

బీదన్న నగర్ పోలీసు కమీషనర్ సుప్రతీం సర్కార్ ఘటనా స్ధలానికి చేరుకున్నారు. ఈ అగ్ని ప్రమాదంలో ప్రోజెక్టర్ రూం పూర్తిగా కాలిపోయిందని అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపారు.