సాఫ్ట్ వేర్ ఇంజినీర్ హత్య కేసు : వెలుగులోకి షాకింగ్ నిజాలు

సంచలనం సృష్టించిన కూకట్ పల్లి సాఫ్ట్ వేర్ ఇంజినీర్ హత్య కేసులో కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. పోలీసుల దర్యాఫ్తులో విస్తుపోయే వాస్తవాలు బయటపడుతున్నాయి.  

  • Published By: veegamteam ,Published On : August 31, 2019 / 09:27 AM IST
సాఫ్ట్ వేర్ ఇంజినీర్ హత్య కేసు : వెలుగులోకి షాకింగ్ నిజాలు

సంచలనం సృష్టించిన కూకట్ పల్లి సాఫ్ట్ వేర్ ఇంజినీర్ హత్య కేసులో కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. పోలీసుల దర్యాఫ్తులో విస్తుపోయే వాస్తవాలు బయటపడుతున్నాయి.  

సంచలనం సృష్టించిన కూకట్ పల్లి సాఫ్ట్ వేర్ ఇంజినీర్ హత్య కేసులో కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. పోలీసుల దర్యాఫ్తులో విస్తుపోయే వాస్తవాలు బయటపడుతున్నాయి.   పక్కా ప్లాన్ ప్రకారం సతీష్ ని  స్నేహితుడు హేమంత్ హత్య చేసినట్టు పోలీసుల విచారణలో తేలింది. వివాహేతర సంబంధమే సతీష్ మర్డర్ కి కారణం అని పోలీసులు గుర్తించారు. ఆగస్టు 27న రాత్రి సతీష్ ను హేమంత్ మర్డర్ చేశాడు. 28న తన భర్త  కనిపించడం లేదని సతీష్ భార్య ప్రశాంతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. 29న రాత్రి హేమంత్ ఇంట్లో సతీష్ మృతదేహం లభ్యమైంది. హత్య తర్వాత హేమంత్ తనకు ఏమీ తెలియనట్టు యాక్ట్ చేశాడు. సతీష్ భార్య  ప్రశాంతి, స్నేహితులతో కలిసి ఉన్నాడు. పోలీసులకు ప్రశాంతి ఫిర్యాదు చేసిన తర్వాత హేమంత్ పారిపోయాడు. 

ఈ మొత్తం వ్యవహారంలో ప్రియాంక అనే అమ్మాయి కీలకంగా మారింది. ప్రియాంక వల్లే ఫ్రెండ్స్ మధ్య గొడవలు జరిగాయి. సతీష్ ద్వారా ప్రియాంక హేమంత్ కు పరిచయమైంది. ప్రియాంకకు తన కంపెనీలో సతీష్ ఉద్యోగం ఇచ్చాడు. కొద్దిరోజులుగా హేమంత్ తో ప్రియాంక సహజీవనం చేస్తోందని పోలీసులు చెప్పారు. గతంలో సతీష్ తో చనువుగా ఉన్న ప్రియాంక ఇప్పుడు హేమంత్ కి దగ్గరైంది. ఈ విషయంలో ఇద్దరు స్నేహితుల మధ్య గొడవ జరిగిందని పోలీసులు తెలిపారు.

కూకట్‌పల్లి కేపీహెచ్‌బీ 7వ ఫేజ్‌లో చిన్ననాటి స్నేహితుడిని అతి కిరాతకంగా హతమార్చిన ఘటన కలకలం రేపింది. హత్య జరిగిన సమయంలో నిందితుడు హేమంత్‌తో పాటు… మరో మహిళ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. పరారీలో ఉన్న నిందితుడు హేమంత్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ప్రియాంకను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. హేమంత్, సతీష్ మధ్య ఆర్థికపరమైన గొడవలున్నట్లు ప్రియాంక తన వాంగ్మూలంలో తెలిపింది. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ సతీష్.. 3 రోజుల క్రితం అదృశ్యమయ్యాడు. ఆ తర్వాత అతడి డెడ్ బాడీ కనిపించింది.