Misbehaviour : ఈ.సీ.జీ. కోసం వెళ్తే… బట్టలు విప్పి వీడియోలు తీశాడు

ఈసీజీ  కోసం ల్యాబ్ కు వెళితే అక్కడ టెక్నీషియన్ యువతిని నగ్నంగా  చేసి.... మొబైల్ తో ఆమె నగ్నశరీరాన్ని వీడియో తీశాడు. ఈ దారుణ ఘటన గుంటూరులో శనివారం చోటు చేసుకుంది.

Misbehaviour : ఈ.సీ.జీ. కోసం వెళ్తే… బట్టలు విప్పి వీడియోలు తీశాడు

Misbehaviour in GGH

Misbehaviour :  గుంటూరులో దారుణం చోటు చేసుకుంది. గుండెల్లో నొప్పి గా ఉందని  వచ్చిన యువతికి ఈసీజీ తీయించుకు రమ్మని డాక్టర్ రిఫర్ చేశారు. ఈసీజీ  కోసం ల్యాబ్ కు వెళితే అక్కడ టెక్నీషియన్ యువతిని నగ్నంగా  చేసి…. మొబైల్ తో ఆమె నగ్నశరీరాన్ని వీడియో తీశాడు. ఈ దారుణ ఘటన గుంటూరులో శనివారం చోటు చేసుకుంది.

వివరాల్లోకి  వెళితే పాత గుంటూరుకు   చెందిన ఒక యువతికి (19) ఛాతిలో  నొప్పిగా ఉండటంతో ఆమె తల్లితండ్రులు ఆమెను గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తీసుకు వెళ్ళారు.  అక్కడ డాక్టర్ యువతి బాధ విని ఈసీజీ తీయించుకు రమ్మని సిఫార్సు చేశారు.

దీంతో ఈసీజీ తీయించుకునేందుకు ల్యాబ్ కు   వెళ్లగా అక్కడ టెక్నీషియన్ గా పని చేస్తున్న హరీష్ అనే  యువకుడు, యువతి తల్లి,తండ్రులను బయటకు వెళ్ళమని చెప్పాడు. యువతిని  ఈసీజీ  తీసేందుకు లోపలకు తీసుకు వెళ్లాడు. అక్కడ యువతిని బట్టలు విప్పమని ఆదేశించాడు. అందుకు ఆమె అంగీకరించలేదు.
Also Read : Rain alert to Chennai: చెన్నైకి మరో గండం.. ఊహించని స్థాయిలో వర్షాలు!
దుస్తులు తీయకపోతే  ఈసీజీ సరిగా రాదని… ఇష్టం లేకపోతే వెళ్లిపోవచ్చని హెచ్చరించాడు.  చేసేది లేక యువతి దుస్తులు విప్పి, సిగ్గుతో కళ్లు మూసుకుని బల్లపై పడుకుంది.  ఈసీజీ పరికరాలు అమర్చక ముందే హరీష్ ఆమెను మొబైల్  కెమెరాతో వీడియో చిత్రీకరించసాగాడు.

అది గమనించిన యువతి గట్టిగా కేకలు వేస్తూ బయటకు వచ్చింది. లోపల జరిగిన విషయాన్ని తన తల్లితండ్రులకు వివరించింది. వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.