MP Sanjay Raut : ఎంపీ సంజయ్ రౌత్ ను చంపేస్తామంటూ బెదిరింపులు

తన ఫోన్ కు బెదిరింపు మెసేజ్ లు, ఫోన్ కాల్ వచ్చాయని దీనిపై పోలీసులు సమాచారం ఇచ్చానని పేర్కొన్నారు. అయితే ఈ విషయాన్ని ప్రభుత్వం సీరియస్ గా తీసుకోవడం లేదన్నారు.

MP Sanjay Raut : ఎంపీ సంజయ్ రౌత్ ను చంపేస్తామంటూ బెదిరింపులు

MP Sanjay Raut

MP Sanjay Raut : మహారాష్ట్రకు(Maharashtra) చెందిన శివసేన(ఉద్ధవ్ బాలాసాహెబ్ థాకరే) ఎంపీ సంజయ్ రౌత్ (MP Sanjay Raut)ను చంపేస్తామంటూ బెదిరింపులు (threatens to kill )వచ్చాయి. తనను హత్య చేస్తామంటూ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ (Lawrence Bishnoi gang) నుంచి బెదింరింపులు వచ్చినట్లు ఎంపీ సంజయ్ రౌత్ ఆరోపించారు. ఈ మేరకు శుక్రవారం రాత్రి తన మొబైల్ ఫోన్ కు మెసేజ్, ఫోన్ కాల్ వచ్చినట్లు ఆయన తెలిపారు. ఈ క్రమంలో శనివారం ఉదయం బెదిరింపుపై ముంబై పోలీసులకు(Mumbai Police) ఫిర్యాదు చేసినట్లు మీడియాకు వెల్లడించారు.

తన ఫోన్ కు బెదిరింపు మెసేజ్ లు, ఫోన్ కాల్ వచ్చాయని దీనిపై పోలీసులు సమాచారం ఇచ్చానని పేర్కొన్నారు. అయితే ఈ విషయాన్ని ప్రభుత్వం సీరియస్ గా తీసుకోవడం లేదన్నారు. అంతకముందు కూడా తనను బెదిరించారని, కానీ రాష్ట్ర హోంమంత్రి దీనిని స్టంట్ గా పేర్కొన్నారని తెలిపారు. రాష్ట్రంలోని ప్రతిపక్ష నేతల భద్రతను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఇలాంటి వాటిని తాను లెక్కచేయనని స్పష్టం చేశారు.

Sanjay Raut: నాపై దాడి చేసేందుకు సీఎం కుమారుడి సుపారీ: సంజయ్ రౌత్

ప్రభుత్వం తనకు భద్రత ఉపసంహరించినప్పటికీ తాను ఎలాంటి లేఖ రాయలేదన్నారు. ఇదిలావుంటే దుండగుల కాల్పుల్లో మృతి చెందిన పంజాయ్ గాయకుడు సిద్ధూ మూసావాలా గతే నీకు పడుతుందంటూ సంజయ్ రౌత్ కు ఫోన్ లో బెదిరింపులు వచ్చాయిని ముంబై పోలీసులు పేర్కొన్నారు. ఢిల్లీలో (Delhi) కలిసి ఏకే-47తో(AK-47) కాల్చి చంపుతామని ఆ మెసేజ్ లో ఉన్నట్లు వెల్లడించారు.  లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి తనకు బెదిరింపులు వచ్చాయని సంజయ్ రౌత్ ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

బెదిరింపు మెసేజ్ పంపిన మొబైల్ నెంబర్ ను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నామని ముంబై పోలీసులు పేర్కొన్నారు. ఈ మేరకు ఒకరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు చెప్పారు. కాగా, పంజాబీ గాయకుడు సిద్ధూ మూసావాలా హత్యకు ప్రధాన సూత్రధారి, కరడుగట్టిన నేరస్థుడు లారెన్స్ బిష్ణోయ్ ప్రస్తుతం పంజాబ్ లో ఉన్నాడు. సిద్ధూ మూసావాలా తండ్రి బాల్కౌర్ సింగ్ తోపాటు ప్రముఖ బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ ను (Salman Khan) కూడా చంపుతామంటూ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ బెదిరించడం గమనార్హం. ఇప్పుడు సంజయ్ రౌత్ ను హత్య చేస్తామని బెదిరించడం కలకలం రేపుతోంది.