‘గొర్రెకుంట’ హత్యల కేసు : మొన్న ఉరిశిక్ష, నేడు యావజ్జీవం

  • Published By: madhu ,Published On : December 12, 2020 / 06:13 AM IST
‘గొర్రెకుంట’ హత్యల కేసు : మొన్న ఉరిశిక్ష, నేడు యావజ్జీవం

gorrekunta accused Sanjay Kumar : ‘గొర్రెకుంట’ సామూహిక హత్యల కేసులో ఉరిశిక్ష పడిన నేరస్థుడికి మరో శిక్ష పడింది. మైనర్ బాలిక రేప్ కేసులో నేరస్థుడికి జీవిత ఖైదు విధిస్తూ..కోర్టు తీర్పును వెలువరించింది. వివాహితతో సహజీవనం చేసి, ఆమె మైనర్ కూతురిని భయపెట్టి పలుమార్లు లైంగిక దాడి చేసినట్లు తేలింది. దీంతో యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తున్నట్లు వరంగల్ మొదటి అదనపు జిల్లా కోర్టు జడ్జీ జయకుమార్ 2020, డిసెంబర్ 11వ తేదీ శుక్రవారం తీర్పును వెలువడించారు. బీహార్‌కు చెందిన సంజ‌య్ కుమార్ 2020 మే 21న తొమ్మిది మందిని వరంగల్ శివారులోని గీసుకొండలోని గొర్రెకుంట బావిలో పడేసి జ‌ల‌స‌మాధి చేశాడు. తాను నేరం చేసినట్లు సంజయ్ అంగీకరించాడు. నిందితుడిపై అభియోగాల‌ను ప‌బ్లిక్ ప్రాసిక్యూట‌ర్ నిరూపించారు. దీంతో సంజయ్‌ను దోషిగా నిర్ధారించిన జడ్జీ జయకుమార్ ఉరిశిక్ష ఖరారు చేశారు. అక్టోబర్ 28న తీర్పును వెలువరించిన విషయం తెలిసిందే. బాధిత బాలికకు ప్రభుత్వ పునరావాస పరిహారం కింద రూ. 4 లక్షలు చెల్లించాలని జడ్జీ జయకుమార్ తీర్పులో వెల్లడించారు. అయితే..పోక్సో చట్టం కింద ఇంతపెద్ద మొత్తంలో పరిహారం చెల్లించాలని కోర్టు చెప్పడం ఇదే మొదటిసారి అంటున్నారు.

గోనె సంచుల తయారీ ఫ్యాక్టరీ :-

బీహార్ రాష్ట్రానికి చెందిన నిందితుడు సంజయ్‌ కుమార్ యాదవ్‌‌ వరంగల్ శివారులోలని గోనె సంచుల తయారీ ఫ్యాక్టరీలో పని చేసేవాడు. పనిచేస్తున్న సమయంలోనే మక్సూద్ కుటుంబంతో సంజయ్ కు పరిచయం ఏర్పడింది. మక్సూద్ భార్య నిషా అక్క కుమార్తె రఫికా వెస్ట్ బెంగాల్ నుంచి ముగ్గురు పిల్లలను తీసుకుని వరంగల్ కు వచ్చి..మక్సూద్ సహాయంతో గోనె సంచుల తయారీ పరిశ్రమలో పని చేసింది. సంజయ్ వద్ద డబ్బులు తీసుకుని..భోజనం పెట్టేది. వీరిద్దరి పరిచయం..సానిహిత్యానికి దారి తీసింది.

రఫికాను చంపేశాడు : –

ఈ క్రమంలో…రఫికాకు యుక్త వయస్సు వచ్చిన కూతురు ఉంది. ఈమెతో చనువుగా ఉండడంపై సంజయ్ ను రఫికా హెచ్చరించింది. పెళ్లి చేసుకుంటానని చెప్పి..కుమార్తెతో చనువుగా ఉండడంతో పోలీసులకు ఫిర్యాదు చేస్తానని రఫికా బెదిరించింది. దీంతో రఫికాను అడ్డు తొలగించుకోవాలని సంజయ్ నిర్ణయించుకున్నాడు. తమ పెళ్లి విషయం బంధువులతో మాట్లాడుదామని చెప్పి…రఫికాను తీసుకుని 2020, మార్చి 06వ తేదీన గరీబ్ రథ్ ఎక్స్ ప్రెస్ లో వెళ్లారని వెల్లడించారు. ప్రీ ప్లాన్ ప్రకారం..మజ్జిగ ప్యాకెట్లలో నిద్ర మాత్రలు వేసి ఇవ్వడంతో రఫీకా సృహ కోల్పోయిందని, అనంతరం చున్నీతో ఉరి వేసి..ట్రైన్ నుంచి కిందకు తోశాడు.

నిలదీసిన మక్సూద్ భార్య :-

రఫికాను పశ్చిమ బెంగాల్ లోని తన బంధువుల ఇంటికి వెళ్లినట్లు సంజయ్ నమ్మించాడు. కొద్ది రోజుల అనంతరం రఫికా ఎక్కడుందని మక్సూద్ భార్య నిషా గట్టిగా ప్రశ్నించింది. పోలీసులకు ఫిర్యాదు చేస్తానని సంజయ్‌ను నిలదీసింది. మక్సూద్ ఆళం, నిషా ఆలంలను హత్య చేయాలని సంజయ్ నిర్ణయించుకున్నాడు.

ఆహారంలో నిద్రమాత్రలు :-
2020, మే 16వ తేదీ నుంచి 20వ తేదీ వరకు గోదాం దగ్గరకు రోజు వెళ్లి వచ్చి రెక్కీ నిర్వహించాడు. 20వ తేదీ మక్సూద్ పెద్ద కొడుకు షాబాజ్ ఆలం పుట్టిన రోజని తెలియడంతో ఆ రోజే ప్లాన్ అమలు చేశాడు. వరంగల్ చౌరస్తాలోని ఓ మెడికల్ షాపు నుంచి 60 నిద్రమాత్రలు తీసుకొని వచ్చి…అదే రోజు రాత్రి 7.30 గంటల సమయంలో గోదాంకు వచ్చాడు. మృతులకు తెలియకుండా…వారి ఆహారంలో నిద్రమాత్రలు కలిపాడు. బీహారీ యువకులు శ్రీరాం, శ్యాంలు తినే ఆహారంలో కూడా నిద్రమాత్రలు కలిపాడు.

బావిలో పడేశాడు :-

అదే రోజు అర్ధరాత్రి 12 గంటల నుంచి ఉదయం 5 గంటలోపు సృహలో లేని 9 మందిని గోనె సంచిలో పెట్టి ఒక్కొక్కరిని బావిలో పడేశాడు. మృతుల గదుల్లో నుంచి కిరాణా సామానులతో పాటు…వారి సెల్ ఫోన్లు తీసుకుని ఇంటికి వెళ్లిపోయాడు. పోలీసుల దర్యాప్తులో తొమ్మిది మందిది హత్యేనని తేలింది.