Publish Date - 11:05 am, Sun, 15 December 19
By
madhuకులజాఢ్యం వీడడం లేదు. ప్రపంచంలో సాంకేతికత అభివృద్ధి చెందుతున్నా కొందరిలో మాత్రం ఇంకా కులం..పట్టింపులు అంటూ రెచ్చిపోతున్నారు. దేశంలో ఎక్కడో ఒకచోట కులం పేరిట దాడులు జరుగుతూనే ఉన్నాయి. కుల బహిష్కరణలు చేస్తున్నారు. తాజాగా ఓ వ్యక్తి బిర్యానీ అమ్ముతున్నాడంటూ పిడిగుద్దులు కురిపించారు. ఎక్కడో మారుమాలలో కాదు. దేశ రాజధానిలో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
గ్రేటర్ నోయిడాలోని రబుపురాలో 43 ఏళ్ల వ్యక్తి లోకేశ్ బిర్యానీ విక్రయిస్తున్నాడు. కొంతమంది వచ్చి అతనిపై దాడి చేశారు. ఇష్టమొచ్చినట్లు కొట్టారు. అక్కడనే తింటున్న వారు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఎవరో ఈ వీడియో తీయడంతో వైరల్ అయిపోయింది. దీనిపై పోలీసులు రెస్పాండ్ అయ్యారు.
Read More : పౌరసత్వ ప్రకంపనలు : జామియా మిలియా ఇస్లామియా వర్సిటీ వద్ద ఉద్రిక్తత
ఈ ఘటనలో ఎస్సీ, ఎస్టీ చట్టం ప్రకారం ముగ్గురు వ్యక్తులపై కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. బాధితుడిని విచారించినట్లు, నిందితుల కోసం గాలిస్తున్నట్లు సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. దళితుడనే కారణంతోనే వారు ఈ దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. దీనిపై ప్రముఖ నటి ఊర్మిళ స్పందించారు. ఇది మన నాగరికత, సంస్కృతి కాదన్నారు. సబ్ కా సాత్, సబ్ కా వికాస్‌కు పూర్తి విరుద్ధమన్నారు.
#WATCH Greater Noida: A 43-year-old man Lokesh being beaten up by some men, allegedly for selling biryani in Rabupura area. pic.twitter.com/iOfXWuDUiM
— ANI UP (@ANINewsUP) December 15, 2019
స్థంభానికి కట్టేసి కొట్టిన భార్య బంధువులు.. యువకుడి ఆత్మహత్య!
Family members of girl kill 19 year old youth : కూతుర్ని ప్రేమించాడని ఇంటికి పిలిచి హత్య చేసిన కుటుంబ సభ్యులు
మీ అమ్మ, చెల్లి, అక్కలను ఇలాగే వేధిస్తావా ? పోకిరిని చితక్కొట్టిన అమ్మాయి
నోట్లో గుడ్డలు కుక్కి..యువకుడిని చావబాదారు, వీడియో వైరల్
గ్యాంగ్ రేప్‌కు ఒప్పుకోలేదని కాలేజీ విద్యార్థినికి నిప్పు.. యూపీలో షాకింగ్ ఘటన
యూపీలో చాట్ వ్యాపారుల అరాచకం : కస్టమర్ల కోసం కర్రలు, ఇనుపరాడ్లతో కొట్టుకున్నారు