Love Couple : 18 ఏళ్ల యువకుడితో 22 ఏళ్ళ యువతి ప్రేమాయణం….

నల్లమల ఫారెస్ట్ ఏరియాలోని ఓ జంట మధ్య ప్రేమ పుట్టింది. ప్రేమించుకునేటప్పుడు వారికి వయసు గుర్తుకు రాలేదు. అమ్మాయి కంటే అబ్బాయి నాలుగేళ్లు చిన్నవాడు.

Love Couple : 18 ఏళ్ల యువకుడితో 22 ఏళ్ళ యువతి ప్రేమాయణం….

Love Couple

Love Couple : ప్రేమ ఈపదం వింటే అనిర్వచనీయమైన అనుభూతికి లోనవుతారు. ప్రేమ అని చెప్పగానే అందరికీ గుర్తొచ్చే అంశాలు కొన్ని ఉంటాయి. వయస్సులో ఉన్న ఇద్దరు ఆడా,మగా కలిసి అలా స్వేఛ్ఛగా కలల లోకంలో విహరిస్తుంటారు. పార్కుల వెంట తిరిగేస్తుంటారు. ఒకరి కళ్లలో ఒకరు కళ్లు పెట్టి చూసుకుంటూ ప్రపంచాన్నే మర్చిపోతుంటారు.

అలాగే నల్లమల ఫారెస్ట్ ఏరియాలోని ఓ జంట మధ్య ప్రేమ పుట్టింది. ప్రేమించుకునేటప్పుడు వారికి వయసు గుర్తుకు రాలేదు. అమ్మాయి కంటే అబ్బాయి నాలుగేళ్లు చిన్నవాడు. వాళ్లిద్దరి మధ్య చిగురించిన ప్రేమకు పెద్దలు అభ్యంతరం చెప్పారు. అమ్మాయికి వేరే వ్యక్తితో పెళ్లి చేయాలని ప్రయత్నాలు మొదలెట్టారు. అది తట్టుకోలేని ప్రేయసి ప్రియులు ఇల్లు విడిచి పారిపోయారు.

వివరాలలోకి వెళితే… నాగర్ కర్నూల్ జిల్లా లింగాల మండలం శ్రీరంగాపురానికి చెందిన ఏదుల సలేశ్వరంగౌడ్(18) ఇంటర్మీడియేట్ వరకు చదువుకున్నాడు. పొట్టకూటి కోసం హైదరాబాద్ వచ్చి ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేసుకు బతుకుతున్నాడు. అతనికి అదే గ్రామానికి చెందిన ఉడ్తనూరి రాధ(22) అనే యువతితో పరిచయం అయ్యింది. రాధ డిగ్రీ మొదటి సంవత్సరం పూర్తి చేసింది.

వీరిద్దరి స్నేహం క్రమేపి ప్రేమగా మారింది. కరోనా నేపధ్యంలో రాధ ఊళ్లోనే ఉంటోంది. సలేశ్వరం గౌడ్ కూడా కరోనా నేపధ్యంలో కొన్నాళ్లు గ్రామానికి వచ్చి ఉన్నాడు. ఆ సమయంలో వీరి ప్రేమ వ్యవహారం రాధ కుటుంబ సభ్యులకు తెలిసిపోయింది. వీరి ప్రేమను పెద్దలు నిరాకరించారు. కరోనా తగ్గుముఖం పట్టి హైదరాబాద్ లో సాధారణపరిస్ధితులు ఏర్పడటంతో సలేశ్వరం తిరిగి హైదరాబాద్ వచ్చేశాడు.

ఈ సమయంలో రాధ కుటుంబ సభ్యులు ఆమెకు వేరే వ్యక్తితో పెళ్లి చేయటానికి నిశ్చితార్ధం జరిపారు. పెళ్లి జరిపేందుకు ఏర్పాట్లు చేయసాగారు. ఈవిషయం రాధ హైదరాబాద్ లో ఉన్న తన ప్రియుడు సలేశ్వరానికి చెప్పింది. సలేశ్వరం గౌడ్ నాలుగు రోజులక్రితం హైదరాబాద్ నుంచి గ్రామానికి తిరిగి వచ్చి రాధను తీసుకు వెళ్ళిపోయాడు. వాళ్లిద్దరూ ఆదృశ్యం కావటంతో రెండు కుటుంబాల వారు గాలింపు చేపట్టారు. ఎంత వెతికినా వారి ఆచూకీ దొరకలేదు.

కాగా ఆదివారం నల్లమల అటవీ ప్రాంతంలో గొర్రెలను మేపుతున్న కొందరు పశువుల కాపరులకు రామచంద్రికుంట సమీపంలో వీరిద్దరూ ఉరి వేసుకుని కనిపించారు. వెంటనే వారు గ్రామస్తులకు సమాచారం చేరవేశారు. గ్రామస్తులు ఘటనాస్ధలానికి వచ్చి వారిని గుర్తుపట్టారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్ధలానికి వచ్చి కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.