ఫ్రెండ్ భార్యతో అక్రమ సంబంధం…సాయిబాబా గుడి సెల్లార్ అస్థిపంజరం కేసు

ఫ్రెండ్ భార్యతో అక్రమ సంబంధం…సాయిబాబా గుడి సెల్లార్ అస్థిపంజరం కేసు

lover killed his friend, due to Illegal affair with friend wife : హైదరాబాద్ ఎస్సార్ నగర్ పోలీసు స్టేషన్ పరిధిలోని సాయిబాబా గుడి సెల్లార్ లో మూడు రోజుల క్రితం లభించిన అస్థిపంజరం కేసు మిస్టరీ వీడింది. స్నేహితుడి భార్యతో అక్రమ సంబంధం పెట్టుకుని అది బయటపడే సరికి స్నేహితుడ్ని హతమార్చి ఇనుప పెట్టెలో పెట్టినట్లు తేల్చారు.

పశ్చిమ బెంగాల్ కు చెందిన పలాష్ పాల్, 2009 లో హైదరాబాద్ కు వచ్చి ఒక రియల్ ఎస్టేట్ సంస్ధలో కార్పెంటర్ గా చేరాడు. ఆక్రమంలో ప్లంబర్ గా పని చేసే కమల్ మైతి తో పాల్ కు పరిచయం ఏర్పడింది. పాల్, కమల్ ఇద్దరిదీ పశ్చిమ బెంగాల్ కావటంతో ఇద్దరి మధ్య స్నేహం మరింత బలపడింది. రెండు కుటుంబాల వారు సన్నిహితంగా ఉండేవారు.

ఈ క్రమంలో కమల్ భార్య భవానీ మైతీ తో, పలాష్ పాల్ వివాహేతర సంబంధం ఏర్పరుచుకున్నాడు. ఈ విషయం కొన్నాళ్లకు కమల్ కు తెలిసిపోయింది. అతను తన భార్యను హెచ్చరించి వివాహేతర సంబంధం మానుకోమని చెప్పాడు. ఈవిషయాన్ని తన అత్తమామలకు  కూడా చెప్పాడు. అప్పటి నుంచి భవానీ పలాష్ పాల్ తో మాట్లాడటం మానేసింది.

kamal maithi

మృతుడు కమల్ మైతి

కమల్ కారణంగానే భవానీ తనకు దూరమైందని భావించిన పలాష్ కమల్ ను తప్పించి,  భవానీని సొంతం చేసుకోవాలనుకున్నాడు. ఎట్టాగైనా కమల్ ను హత్య చేయాలని ప్లాన్ వేశాడు. ఎస్పీఆర్ హిల్స్ లో కమల్ ఇల్లు నిర్మిస్తున్నాడు.  అతని ఇంటిలో డోర్స్, కిటికీలు అమర్చే  పనిని పాల్ తీసుకున్నాడు. 2020 జనవరి 10న కమల్ కు ఫోన్ చేసి డోర్స్ వర్క్ పూర్తయ్యిందని… ఒకసారి వచ్చి చూసుకువెళ్లమని చెప్పాడు.

కాగా… పలాష్ ఎస్సార్ నగర్ పోలీసు స్టేషన్ పరిధిలోని   ఒకసాయిబాబా గుడి కింద సెల్లార్ లో 2017 నుంచి కార్పెంటర్ షాపు నడుపుతున్నాడు. పలాష్   చేసిన ఫోన్ తో   కమల్ కార్పెంటర్ షాపుకు వెళ్లాడు. అతను షాపు లోపలకు రాగానే కమల్ తలపై, పలాష్  కర్రతో గట్టిగా కొట్టటంతో అతను అక్కడికక్కడే చనిపోయాడు. మృతదేహాన్ని పెట్టెలో పెట్టి తాళం వేసి అక్కడి నుంచి పారిపోయాడు.

ఆ రోజు రాత్రి భర్త ఇంటికి రాకపోవటంతో,మర్నాడు ఉదయం  భవానీ జూబ్లీ హిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇదిలా ఉండగా సాయిబాబా గుడిలోని సెల్లార్ లోంచి దుర్వాసన వస్తోందంటూ ఆలయ పూజారి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టారు.
skelitin

అది శవం వాసనగా గుర్తించి ..పలాష్  కార్పెంటరీ షాపులోంచి వస్తున్నట్లు  తెలుసుకున్నారు. షాపు తాళాలు పగలకొట్టి చూడగా లోపల ఉన్న ఇనుప పెట్టెలో కమల్ మృతదేహాం బయటపడింది. కేసు విచారణ  చేపట్టిన పోలీసులు పలాష్ పాల్ ను నిందితుడిగా తేల్చారు. ఈ కేసులో కమల్ భార్యకు సంబంధం లేదని పోలీసులు వివరించారు.