బాబా వేషంలో ప్రేమికుడు…. గడ్డం లాగటంతో బండారం బట్టబయలైంది

బాబా వేషంలో ప్రేమికుడు…. గడ్డం లాగటంతో బండారం బట్టబయలైంది

lover went to the girlfriend’s house in the guise of Baba : పాత తెలుగు సినిమాల్లో హీరోలు కానీ కమెడియన్లు కానీ మారువేషంలో ప్రేమికురాలి ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చి వాళ్ల గురించి తెలుసుకుంటూ అక్కడి పరిస్ధితులు తెలుసుకుంటూ ఉండేవారు. వారితో మాట్లాడి ప్రేక్షకులను అలరించేవారు. ఆ డ్రామాను ప్రేక్షకులు ఆదరించారు కూడా. కానీ నిజ జీవితంలో ప్రేమకురాలి  గురించి తెలుసుకోవటం కోసం ఒక యువకుడు బాబా వేషం వేసి    బెడిసి కొట్జి జనాలతో తన్నులు తిన్నాడు.

ఒడిషాలోని భువనేశ్వర్ లో జాజ్ పూర్ రోడ్డులో ఉన్న ఫెర్రోక్రోమ్ గేటు కాలనీలో 12వ తరగతి చదువుతున్న విద్యార్ధిని ఒక యువకుడు ప్రేమించాడు.   వీరి ప్రేమ గురించి  అమ్మాయి ఇంట్లో తెలిసి కూతుర్ని కట్టడి చేశారు.   దీంతో అమ్మాయి బయటకు రావటం మానేసింది, ఆమె క్షేమ సమాచారాలు ప్రియుడికి తెలియటంలేదు.    ఆమె బాగోగులు తెలుసుకోవటం కోసం  బాబా వేషం వేసుకుని  శనివారం ఉదయం ఆమె నివసించే కోలనీ కి వచ్చి ఆమె ఇంటి చుట్టూ పలుమార్లు తిరగసాగాడు.

ఆయినా ఆమె బయటకు రాలేదు.   ఇతని వాలకం చూసిన కాలనీ వాసులు అడ్డుకుని వివరాలు అడిగారు.   మొదట తాను హిమాలయాల నుంచి వచ్చానని అబద్దం చెప్పాడు.    అతడి మాటలు నమ్మని స్ధానికులు పట్టుకుని దేహశుద్ది చేయబోయారు.   ఆ క్రమంలో గడ్డం పట్టుకుని లాగే సరికి ఊడి చేతిలోకి వచ్చింది.   ప్రేమికుడు విషయం చెపుతున్నా వినకుండా చితకబాది పోలీసులకు అప్పగించారు.