lovers ends life : ప్రేమలో గెలిచి… జీవితంలో ఓడిన ప్రేమజంట

lovers ends life : ప్రేమలో గెలిచి… జీవితంలో ఓడిన ప్రేమజంట

Couple Suicide

Bengaluru lovers ends life in Chennai, after girl mother oppose love : నాకు నీవు..నీకు నేను.. ఒకరి కొకరం.. నువ్వూ..నేను అనుకుంటూ ప్రేమించుకున్నారు. పెద్దలనెదిరించి పెళ్లి కూడా చేసుకుందామనుకున్నారు. కానీ జీవితంలో పోరాడలేక కన్నుమూసిని బెంగుళూరు ప్రేమ జంట విషాధ గాధ ఇది.

తమిళనాడు, చెన్నైలో పెరుంబాక్కం పోలీసు స్టేషన్ పరిధిలోని పళ్లికరణై రోడ్డు, చిట్లపాకం అపసన్ కాలనీలో గుర్తు తెలియని మృతదేహాలు ఆలింగనం చేసుకున్న పరిస్ధితిలో పడి ఉండటం గమనించిన స్ధానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఘటనా స్ధలానికి వచ్చిన పోలీసులు వారిని పరిశీలించగా అప్పటికే మరణించినట్లు గుర్తించారు. వారి వద్ద ఉన్న గుర్తింపు కార్డు, చిరునామాల ఆధారంగా వారు బెంగుళూరు ఆర్కేపురానికి చెందిన వారిగా గుర్తించారు.

వారి వద్ద ఉన్న మరిన్ని ఆధారాలతో వారు చెన్నై ఎందుకు  వచ్చారు అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. విచారణలో లభించిన ఆధారాల ప్రకారం… కర్ణాటక లోని బెంగుళూరు కు చెందిన అభినేష్(30) పల్లవి(30) బావామరదళ్లు. అభినేష్ ప్రైవేట్ కంపెనీలో పని చేస్తున్నాడు. వీరిద్దరూ రెండేళ్లనుంచి ప్రేమలో ఉన్నారు.

ఈవ్యవహారం పల్లవి తల్లి గాయత్రికి తెలిసింది. వీరి ప్రేమకు అడ్డు చెప్పింది. తీవ్రంగా మందలించింది. పల్లవి అభినేష్ ను కలవకుండా కట్టడి చేసింది. తల్లికి తెలిసిపోయి కట్టడిచేసే సరికి ఇంక తమ పెళ్లికి ఇంట్లో వాళ్లు అడ్డుపడతారని అర్ధం చేసుకున్నారు. 10 రోజులక్రితం ఇద్దరూ ఇళ్లనుంచి పారిపోయి బయటకు వచ్చేశారు.

ఇద్దరూ చెన్నై చేరుకున్నారు. తాంబరం– చిట్లపాక్కం మార్గంలోని పిల్లయార్‌ కోవిల్‌ వీధిలోని తన సోదరి ఇంటికి అభినేష్‌ పల్లవితో చేరుకున్నాడు. వీరికోసం గాలింపు చేపట్టిన పల్లవి తల్లి చెన్నైలో  ఉన్నట్లు తెలుసుకుంది. అభినేష్ సోదరికి ఫోన్ చేసి చీవాట్లు పెట్టింది. వారిద్దరికీ ఆశ్రయమిస్తే ఇబ్బందుల్లోపడతావు అన్నంతగా వార్నింగ్ ఇచ్చింది.

గాయత్రి మాటలు విన్న అభినేష్ సోదరి ప్రమాదం పొంచి ఉందని గ్రహించి ఇద్దరినీ బెంగుళూరు వెళ్ళిపొమ్మని కోరింది. దీంతో ప్రేమకులిద్దరూ అక్కడి నుంచి బయటకు వచ్చేశారు. బెంగుళూరుకు వెళ్తే విడదీస్తారని… ప్రాణానికి హాని తలపెడతారని భయపడ్డారు.

రెండేళ్లుగా ప్రేమించుకుంటున్న తాము .. జీవితంలో కలిసి బతకలేమని గ్రహించారు. ప్రేమలో గెలిచిన తాము… జీవితంలో ఓడిపోతున్నామని అర్ధమై పోయింది వారికి. బెంగుళూరు వెళ్లలేక తనువు చాలించాలనుకున్నారు.

నిజజీవితంలో మమల్ని విడదీయాలనుకున్నారు. కానీ చావులో మమ్మల్ని విడదీయలేరన్నట్లుగా ఒకరినొకరు ఆలింగనం చేసుకున్నారు. ముందుగా సిధ్ధం చేసుకున్నవిషాన్ని ఇద్దరూ తీసుకున్నారు. అదే స్ధితిలో మృత్యు ఒడిలోకి జారిపోయారు.

వీరి మరణ సమాచారాన్ని పోలీసులు బెంగుళూరులోని కుటుంబ సభ్యులకు అందించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం క్రోం పేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పల్లవి తల్లి గాయత్రిపై  కేసు నమోదుకు పోలీసులు చర్యలు చేపట్టారు.