Nalgonda : ప్రేమ జంట ఆత్మహత్యాయత్నం…ప్రియుడు గల్లంతు

నల్గొండ జిల్లా హాలియా సమీపంలో నాగార్జున సాగర్ ఎడమ కాలువలోకి దూకి ఒక ప్రేమ జంట ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వరసకు బావ,మరదళ్లు అయ్యే   ఇద్దరు ప్రేమించుకున్నారు.

Nalgonda : ప్రేమ జంట ఆత్మహత్యాయత్నం…ప్రియుడు గల్లంతు

Nalgonda

Nalgonda:  నల్గొండ జిల్లా హాలియా సమీపంలో నాగార్జున సాగర్ ఎడమ కాలువలోకి దూకి ఒక ప్రేమ జంట ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వరసకు బావ,మరదళ్లు అయ్యే   ఇద్దరు ప్రేమించుకున్నారు. వీరి పెళ్లికి ఇంట్లో  పెద్దలు, బంధువులు అభ్యంతరం చెప్పారు. దీంతో  సోమవారం ఉదయం ఇద్దరూ హాలియా సమీపంలోనినాగార్జున సాగర్ ఎడమకాలువలోకి దూకి ఆత్మహత్యాయత్నం చేశారు.

స్ధానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు సకాలంలో ఘటనా స్ధలానికి వచ్చి తాళ్లసాయంతో యువతిని రక్షించారు.  కాగా ప్రియుడు బాలకృష్ణ నీటి ప్రవాహంలో కొట్టకుపోయాడు.  బాలకృష్ణ(20)ది మాచర్ల కాగా, ప్రియురాలిది పీఏ పల్లి మండలం నర్సింగ్ తండా అని తెలిసింది. వీరిలో  ప్రియురాలు మైనర్ . వీరిద్దరూ గత కొంతకాలంగా ప్రేమించుకుంటుున్నారు. బాలకృష్ణ కోసం గాలింపు చేపట్టారు.

Also Read : Molestation : కన్నకూతుళ్లపై లైంగిక దాడి చేసిన కసాయి తండ్రి