Madhya Pradesh : ఆన్ లైన్‌‌లో 40 వేలు పొగొట్టుకున్న బాలుడు, మందలించడంతో ఉరేసుకున్నాడు

ఆన్ లైన్‌‌లో రూ. 40 వేలు పొగొట్టుకున్నాడు..తల్లికి విషయం తెలియడంతో..మందలించింది. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన బాలుడు..ఉరేసుకుని చనిపోయాడు. దీంతో తల్లిదండ్రులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది.

Madhya Pradesh : ఆన్ లైన్‌‌లో 40 వేలు పొగొట్టుకున్న బాలుడు, మందలించడంతో ఉరేసుకున్నాడు

Online Game

Online Game : ఆన్ లైన్‌‌లో రూ. 40 వేలు పొగొట్టుకున్నాడు..తల్లికి విషయం తెలియడంతో..మందలించింది. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన బాలుడు..ఉరేసుకుని చనిపోయాడు. దీంతో తల్లిదండ్రులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. ఆత్మహత్య చేసుకొనక ముందు..బాలుడు ఓ లేఖ రాశాడు. పోలీసులు రంగ ప్రవేశం చేసి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Read More : Lal Darwaza : లష్కర్ బోనాలు, అమ్మా బైలెల్లినాదో

వివరాల్లోకి వెళితే…

ఛత్తర్ పూర్ కు చెందిన ఓ బాలుడు ఆన్ లైన్ లో గేమ్స్ ఆడుతుండేవాడు. తల్లిదండ్రులకు తెలియకుండా వారి బ్యాంకు ఖాతా నుంచి రూ. 1500 తీసుకున్నట్లు తల్లి ఫోన్ కు మెసేజ్ వచ్చింది. దీంతో ఆమె..కొడుక్కి ఫోన్ చేసి డబ్బు గురించి ప్రశ్నించింది. ఆన్ లైన్ లో గేమ్ ఆడినందుకు డబ్బు తీసుకున్నట్లు వెల్లడించడంతో తల్లి మందలించింది. దీంతో మనస్తాపానికి గురైన బాలుడు…తన గదిలోకి వెళ్లి..సీలింగ్ ఫ్యాన్ కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

Read More : Indian Women’s Hockey : ఒలింపిక్స్ లో క్వార్టర్ ఫైనల్ కు చేరిన భారత మహిళల హాకీ జట్టు

సూసైడ్ లేఖ : –
బాలుడు ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులకు సమాచారం అందింది. వెంటనే ఘటనా ప్రదేశానికి చేరుకున్నారు. అక్కడ బాలుడు రాసిన సూసైడ్ లేఖ స్వాధీనం చేసుకున్నారు. అందులో మరిన్ని విషయాలు వెలుగు చూశాయి. తన తల్లి బ్యాంకు ఖాతా నుంచి రూ. 40 వేలు నగదు తీసి ఆన్ లైన్ లో మొబైల్ గేమ్ ఆడేందుకు ఖర్చు చేసినట్లు లేఖలో వెల్లడించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు..పోస్టుమార్టం అనంతరం బాలుడి మృతదేహాన్ని తల్లిదండ్రులకు అప్పగించారు. కొడుకు మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. అసలు గేమ్ లో బాలుడు తనకు తానుగా డబ్బు పెట్టాడా ? లేదా సొమ్ము కోసం ఎవరైనా బెదిరించారా ? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మొత్తంగా మొబైల్ గేమ్ బాలుడి ప్రాణాలు తీసింది.