ఆస్పత్రిలో ఆడశిశువును గొంతు నులిమి చంపేసిన తల్లిదండ్రులు

  • Published By: sreehari ,Published On : November 6, 2020 / 06:48 AM IST
ఆస్పత్రిలో ఆడశిశువును గొంతు నులిమి చంపేసిన తల్లిదండ్రులు

newborn girl to death : అప్పుడే పుట్టిన ఆడశిశువును కన్నతల్లిదండ్రులే కడతేర్చారు. ఆడశిశువు హత్యలను నివారణ కోసం ప్రభుత్వాలు అనేక అవగాహన కార్యక్రమాలు చేపట్టినప్పటికీ పురిటిలోనే ఆడశిశువులను చంపేస్తున్నారు.

తాజాగా మధ్యప్రదేశ్‌లోని మోరెనా జిల్లాలో పుట్టిన ఆడశిశువును తల్లిదండ్రులు చంపేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.



ఆస్పత్రిలో పుట్టిన ఆడబిడ్డను గొంతునులిమి చంపేశారు. పాలు పట్టాలంటూ ఆస్పత్రిలో శిశువుల వార్డులోని ఆడశిశువును బయటకు తీసుకెళ్లి తల్లిదండ్రులు గొంతునులిమి చంపేశారు.

కొన్ని గంటల తర్వాత ఆస్పత్రి వైద్యులు తల్లిదండ్రులను శిశువు ఎక్కడా అని ఆరా తీయగా.. చనిపోయిందని ఇంటికి తీసుకెళ్లామంటూ సమాధానమిచ్చారు. అనుమానం వచ్చిన వైద్యులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఆడశిశువును చంపిన అనుజ్ రావత్, శైలేంద్ర రావత్ తల్లిదండ్రులను పోలీసులు అరెస్ట్ చేశారు.



https://10tv.in/australia-demands-answers-after-women-taken-from-qatar-airways-flight-and-strip-searched/
మోరెనా జిల్లా ఆస్పత్రిలో నాలుగు రోజలు క్రితం అనూజ్ ఆడశిశువుకు జన్మనిచ్చింది. పుట్టిన శిశువును స్పెషల్ న్యూ బార్న్ కేర్ యూనిట్ (SNCU)లో చేర్పించారు. పసిపాపకు పాలు ఇస్తానంటూ తల్లి అనూజ్ బయటకు తీసుకెళ్లింది.



ఆ తర్వాత పాప చనిపోయిందని చెప్పడంతో పోలీసులకు ఆస్పత్రి యాజమాన్యం ఫిర్యాదు చేసింది. చనిపోయిన ఆడశిశువును పోస్టుమార్టానికి తరలించగా.. గొంతు నులిమి చంపేసినట్టు రిపోర్టులో తేలింది.