Madhya Pradesh : విద్యాశాఖ మంత్రి కోడలు ఆత్మహత్య | Madhya Pradesh

Madhya Pradesh : విద్యాశాఖ మంత్రి కోడలు ఆత్మహత్య

మధ్య ప్రదేశ్   విద్యాశాఖ మంత్రి ఇందర్ సింగ్ పర్మార్ కోడలు షాజపూర్ లోని వారి  ఇంట్లో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది.

Madhya Pradesh : విద్యాశాఖ మంత్రి కోడలు ఆత్మహత్య

Madhya Pradesh : మధ్య ప్రదేశ్   విద్యాశాఖ మంత్రి ఇందర్ సింగ్ పర్మార్ కోడలు షాజపూర్ లోని వారి  ఇంట్లో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. మంగళవారం ఈ ఘటన జరగ్గా మృతురాలిని సవితా పర్మార్(23)గా గుర్తించారు. బుధవారం ఉదయం పోస్టు మార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు.

ఇందర్ సింగ్ కుమారుడు దేవరాజ్ సింగ్ తో సవిత కు మూడేళ్ళ క్రితం వివాహం అయ్యింది. కుటుంబ సమస్యల కారణంగా ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు ప్రాధమిక నిర్ధారణకు వచ్చారు.  ఘటన జరిగిన సమయంలో మంత్రి భోపాల్ లో ఉండగా… సవిత భర్త దేవరాజ్ సింగ్ పక్క గ్రామంలోని మహమ్మద్ ఖేరాలో ఒక వివాహానికి హజరైనట్లు తెలుస్తోంది. ఇంట్లో ఇతర బంధువులు ఉన్నారు.

మృతదేహం వద్ద ఎటువంటి  సూసైడ్ నోట్ లభించలేదు.  సమాచారం తెలిసిన వెంటనే మంత్రి, ఆయన కుమారుడు ఇంటికి చేరుకున్నారు. మంత్రి ఇంటివద్ద పెద్ద ఎత్తున పోలీసులను మొహరించారు. కేసు నమోదు  చేసుకున్న  పోలీసులు దర్యాప్తు  చేస్తున్నారు.
Also Read : Asani Cyclone: అసని ఎఫెక్ట్.. 37రైళ్లు రద్దు చేసిన రైల్వే శాఖ

 

×