హైదరాబాద్‌లో మత్తుమందు దొరికింది..!

10TV Telugu News

హైదరాబాద్ మహానగరం మత్తు పదార్థాలకు అడ్డాగా మారుతోందా? జరుగుతున్న పరిణామాల్ని చూస్తే ఇలాంటి అనుమానాలే కలుగుతాయి.. నగరంలో మరోసారి భారీగా డ్రగ్స్ బయటపడింది.. మత్తుమందు తయారు చేస్తున్నవాళ్లను పట్టుకున్నారు.ఒక ఫార్మా కంపెనీలో మత్తుమందు తయారు చేస్తుండగా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ నుంచి ముంబైకి కార్గో బస్సులో మత్తుమందు రవాణా చేస్తుండగా పోలీసులు పట్టుకున్నారు.రూ.100 కోట్ల విలువైన మత్తుమందును డీఆర్ఐ స్వాధీనం చేసుకుంది. దేశ వ్యాప్తంగా మత్తుమందు సరఫరా చేసేందుకు డ్రగ్స్ మాఫియా ప్లాన్ చేసినట్టు డీఆర్ఐకి సమాచారం అందింది. 2017లో అరెస్ట్ అయిన డ్రగ్ డీలర్‌ను తిరిగి డీఆర్ఐ అరెస్ట్ చేసింది. రూ.50 కోట్ల విలువైన మత్తుమందు రామెటేరియల్ కూడా స్వాధీనం చేసుకున్నారు.

10TV Telugu News