Maharashtra: వ్యాపారవేత్తకు చేదు అనుభవం.. ఫోన్ హ్యాక్ చేసి కోటి రూపాయలు కొట్టేశారు
ఈ విషయమై బాధితుడి నుంచి కేసు తీసుకుని విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. సమాచార సాంకేతిక శాఖ సహాయం తీసుకుని నిందితుల్ని పట్టుకునే ప్రయత్నం చేస్తామని వారు పేర్కొన్నారు. అయితే ఇంత పెద్ద మొత్తం డబ్బు కోల్పోయిన ఆ వ్యాపారవేత్త పేరు మాత్రం బయటికి వెల్లడించలేదు పోలీసులు.

Maharashtra Businessman Loses Nearly ₹ 1 Crore After Phone Hacked
Maharashtra: ఆన్లైన్, సైబర్ మోసాల గురించి వింటూనే ఉన్నాం. సాంకేతికత పెరిగినా కొద్ది ఆస్తులకు రక్షణ, వ్యక్తులకు ప్రైవసీ లేకుండా పోతోంది. తాజాగా ముంబైకి చెందిన ఒక వ్యాపారవేత్త మొబైల్ ఫోన్ హ్యాక్ చేసి సుమారు కోటి రూపాయలు కొట్టేసినట్లు పోలీసులు గురువారం తెలిపారు. నవంబర్ 6-7 మధ్య మొబైల్ ఫోన్ హ్యాక్ అయిందట. అనంతరం దాన్నుంచి బ్యాంకుకు లావాదేవీలకు సంబంధించిన వివరాలను తీసుకుని, నెట్ బ్యాంకింగ్ ద్వారా 99.50 లక్షల రూపాయలు వేరే బ్యాంకు ఖాతాకు బదిలీ చేసినట్లు వాఘేల్ ఇస్టేట్ పోలీసులు వెల్లడించారు.