Pushpa : పుష్ప స్టైల్లో ఎర్ర చందనం స్మగ్లింగ్.. మహారాష్ట్ర పోలీసులకు చిక్కిన స్మగ్లర్

కర్ణాటకకు చెందిన ఒక ఎర్రచందనం స్మగ్లర్ పుష్ప మాదిరిగానే ఎన్నో చెక్ పోస్టులను దాటించి ఎర్రచందనం స్మగ్లింగ్ చేయటంలో దిట్ట. అలాంటి స్మగ్లర్ మహారాష్ట్ర పోలీసుల చేతికి చిక్కాడు.

Pushpa : పుష్ప స్టైల్లో ఎర్ర చందనం స్మగ్లింగ్.. మహారాష్ట్ర పోలీసులకు చిక్కిన స్మగ్లర్

Red Sandal Smuggling

Pushpa :  తగ్గేదేలే…. అంటూ పుష్ప సినిమాలో పోలీసులను, అటవీ శాఖ అధికారులను ఏమార్చి ఎర్ర చందనాన్ని స్మగ్లింగ్ చేస్తాడు హీరో పుష్పరాజ్. కర్ణాటకకు చెందిన ఒక ఎర్రచందనం స్మగ్లర్ పుష్ప మాదిరిగానే ఎన్నో చెక్ పోస్టులను దాటించి ఎర్రచందనం స్మగ్లింగ్ చేయటంలో దిట్ట. అలాంటి స్మగ్లర్ మహారాష్ట్ర పోలీసుల చేతికి చిక్కాడు.

వివరాల్లోకి వెళితే… కర్ణాటకలోని బెంగుళూరు సమీపంలోని అనేకల్ కు చెందిన సయ్యద్ యాసిన్ ఎర్ర చందనం స్మగ్లర్. పోలీసులకు చిక్కకుండా ఎర్ర చందనాన్ని అనుకున్న గమ్యానికి చేరవేస్తూ ఉంటాడు. తాను తీసుకువెళ్లే సరుకును పోలీసులకు అనుమానం రాకుండా ప్రతి చెక్ పోస్ట్ లోనూ పోలీసులను బోల్తా కొట్టించి తీసుకువెళతాడు.

ఇటీవల తన లారీలో ఎర్ర చందనం దుంగలను లోడ్ చేయించుకుని సరుకు డెలివరీ ఇవ్వటానికి బయలుదేరాడు. లారీ ముందు భాగంలో కోవిడ్ బాధితులకు పండ్లు సరఫరా చేసేవాహనం అని రాయించాడు. లారీలో ఎర్ర చందనం దుంగలతో పాటు కొన్ని పండ్లు కూడా లోడ్ చేయించుకుని సరుకుతో బయలు దేరాడు.  ఆంధ్ర,కర్ణాటక చెక్ పోస్టుల్లో అధికారులకు మస్కా కొట్టి  జనవరి 31 సోమవారం నాడు  మహారాష్ట్ర చేరుకున్నాడు.

అక్కడ గాంధీచౌక్ ప్రాంతంలో పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తున్నారు. ఈ క్రమంలో పోలీసుల యాసిన్ వాహనాన్ని తనిఖీ చేశారు. మహారాష్ట్ర పోలీసులను నమ్మించటానికి  ప్రయత్నించాడు.   కానీ పోలీసులు తనిఖీ చేయగా ఎర్ర చందనం దుంగలు బయటపడటంతో యాసిన్ ను పోలీసులు  అదుపులోకి తీసుకున్నారు.
Also Read : Electric Scooter : తప్పిన ప్రమాదం-పేలిన ఎలక్ట్రిక్ స్కూటర్ బ్యాటరీ
పోలీసుల స్వాధీనం చేసుకున్న ఎర్రచందనం దుంగల విలువ సుమారు రూ.2.45 కోట్లు ఉంటుందని తెలిసింది. వీటిని తరలించేందుకు ఉపయోగించిన లారీ విలువ 10 లక్షల రూపాయలు ఉంటుందని పోలీసులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ నుంచి ఎర్ర చందనాన్ని తీసుకు వెళుతున్నట్లు పోలీసులు తెలుసుకున్నారు. సయ్యద్ యాసిన్ వెనుక ఉన్న ముఠా గురించి పోలీసులు ఆరా తీస్తున్నారు.