Maharashtra Crime : మహారాష్ట్రలో దారుణం .. వాన్ నదిలో గుట్టలుగా శిశువుల మృతదేహాలు

మహారాష్ట్రంలో అత్యంత దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ నదిలో శిశువుల మృతదేహాలు కనిపించాయి. వాన్ నదిలో భారీగా శిశువు శవాలు కనిపించటం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

Maharashtra Crime : మహారాష్ట్రలో దారుణం .. వాన్ నదిలో గుట్టలుగా శిశువుల మృతదేహాలు

Maharashtra Crime : మహారాష్ట్రంలో అత్యంత దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ నదిలో శిశువుల మృతదేహాలు కనిపించాయి. మహారాష్ట్రంలోని వాన్ నదిలో భారీగా శిశువు శవాలు కనిపించటం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.బుల్దానాలోని సంగ్రామ్ పూర్ తాలూకా కోలాయిడ్ గ్రామంలోని వాన్ నదిలో అనేక శివులు పిండాలు కలకలం రేపాయి. అక్రమ అబార్షన్లు చేసి ఆ పిండాలను ఇలా నదిలో పారేసినట్లుగా తెలుస్తోంది.

నదిలో ఈ పిండాలను చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించటంతో హుటాహుటిన వచ్చిన పోలీసులు విచారణ చేపట్టగా నమ్మలేని సంచలన విషయాలు బయటపడ్డాయి. పెద్ద ఎత్తున అక్రమ అబార్షన్ల రాకెట్ జరుగుతోందని పోలీసులు గుర్తించారు. నదిలో శిశువుల మృతదేహాలు పడి ఉన్నాయనే విషయం తెలియటంతో స్థానికులు పెద్ద ఎత్తున నది వద్దకు వచ్చి చూసి షాక్ అవుతున్నారు.

బోగ్రాలో డాక్టర్లు గిరిజనుల ప్రాబ్ల్య ప్రాంతాల్లో పె్దద ఎత్తున పనిచేస్తున్నారని స్థానికులు చెబతున్నారు. పలు సందర్భాల్లో డాక్టర్లు అక్రమ అబార్షన్లకు పూనుకుంటున్నారనే విమర్శలు వస్తున్నాయి. అబార్షన్ల తరువాత చనిపోయిన శిశువుల పిండాలను నదుల్లో పారేస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనపై తమ్ గావ్ పోలీసు స్టేషన్ లో విచారణ కొనసాగుతోంది. అక్రమ అబార్షన్ల రాకెట్ వల్లే ఇటువంటి దుస్థితి ఉందని పోలీసులు చెబతున్నా..జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు మాత్రం నోరు మెదపటంలేదు. దీనిపై మీడియా ప్రశ్నించినా మాట్లాడటానికి నిరాకరించారు.

ఈ సంఘటన గురించి ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం.. మంగళవార (నవంబర్ 22,2022) బుల్దానాలోని సంగ్రామ్‌పూర్ తాలూకాలోని కోలాడ్ గ్రామంలోని వాన్ నదిలో పెద్ద సంఖ్యలో చనిపోయిన పిండాలను కనుగొన్న ఈ పిండాలు నాలుగు నుండి ఆరు నెలల శిశువులున్నాయి. ఈ ఘటన గ్రామం మొత్తం భయాందోళనకు గురి చేసింది. దీంతో గ్రామస్థులు సమీపంలోని తమ్‌గావ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సెక్షన్ 318 కింద కేసు నమోదు చేసిన పోలీసులు.. మృత పిండాన్ని గుర్తించిన వార్త గ్రామంలో దావానంలా వ్యాపించింది. గ్రామం మొత్తం నది ఒడ్డున చేరి నిందితులను త్వరగా అరెస్ట్ చేయాలని పోలీసులను డిమాండ్ చేశారు.ఈ అక్రమ అబార్షన్ల రాకెట్ ను త్వరలో ఛేదిస్తామని..బాధ్యులైనవారిపై కేసు నమోదు చేసి కోర్టుకు అప్పగిస్తామని చెబుతున్నారు.