Molestation : నెల్లూరు జీజీహెచ్ ఘటనపై మహిళా కమీషన్ ఆగ్రహం

నెల్లూరు ప్రభుత్వ ఆస్పత్రి సూపరిండెంట్ లైంగిక వేధింపుల ఆరోపణలపై తక్షణం సమగ్ర దర్యాప్తు జరపాలని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్-పర్సన్ వాసిరెడ్డి పద్మ అధికారులను ఆదేశించారు. ఈరోజు ఉదయం నెల్లూరు జిల్లా కలెక్టర్ తో మాట్లాడిన ఆమె... ఇటువంటి కామాంధుల ను ఉపేక్షించరాదని కోరారు.

Molestation : నెల్లూరు జీజీహెచ్ ఘటనపై మహిళా కమీషన్ ఆగ్రహం

Molestation

Molestation : నెల్లూరు ప్రభుత్వ ఆస్పత్రి సూపరిండెంట్ లైంగిక వేధింపుల ఆరోపణలపై తక్షణం సమగ్ర దర్యాప్తు జరపాలని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్-పర్సన్ వాసిరెడ్డి పద్మ అధికారులను ఆదేశించారు. ఈరోజు ఉదయం నెల్లూరు జిల్లా కలెక్టర్ తో మాట్లాడిన ఆమె… ఇటువంటి కామాంధుల ను ఉపేక్షించరాదని కోరారు. వైద్య విద్యార్థినుల పట్ల అసభ్య ప్రవర్తన పై బాధితులు వాట్సాప్ నెంబరు 9394528968 కు స్వయంగా సంప్రదించవచ్చని తెలిపారు.

కరోనా సమయంలో ప్రత్యక్షదైవంగా చూస్తున్న వైద్య వృత్తికి మచ్చ తెచ్చే విధంగా నెల్లూరు ప్రభుత్వాసుపత్రి సూపరిండెంట్ వ్యవహరించటం బాధాకరమని పద్మ ఆవేదన వ్యక్తం చేశారు. ఇతని తప్పుడు ప్రవర్తన కు మానసికంగా కృంగిపోయిన బాధితులు అందరూ నిర్భయంగా వివరాలు మహిళా కమిషన్ కు వెల్లడించాలని పద్మ కోరారు. ఇతని పై ఫిర్యాదు చేసిన బాధితుల వివరాలు రహస్యంగా ఉంచబడతాయని… అందరూ ధైర్యంగా ఫిర్యాదు చేయాలని, విచారణలో అన్ని విషయాలు వెల్లడించాలని వాసిరెడ్డి పద్మ విజ్ఞప్తి చేశారు. ఈ వ్యవహారంపై దర్యాప్తు జరపాలని వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీని కూడా మహిళా కమిషన్ కోరింది.

నెల్లూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ పై లైంగిక ఆరోపణలు వెల్లువెత్తాయి. సూపరింటెండెంట్, వైద్య విద్యార్థినికి మధ్య సంభాషణకు సంబంధించిన ఓ ఆడియో గురువారం వైరల్ అయ్యింది. తన కోరిక తీర్చాలంటూ వైద్య విద్యార్థినులు, మహిళా హౌజ్ సర్జన్లు, డాక్టర్లతో పాటు మహిళా సిబ్బందిని సూపరింటెండెంట్ వేధిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. కారులో ఒంటరిగా రావాలని, తనతో గడపాలని వారిని బెదిరిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి.

ఈ క్రమంలో కొవిడ్ విధుల్లో ఉన్న ఓ వైద్య విద్యార్థినిని సైతం ఆ ఉన్నతాధికారి లైంగిక వేధింపులకు గురిచేశాడు. అతని వేధింపులు తట్టుకోలేక ఆ వైద్య విద్యార్థిని ఎదురు తిరిగింది. ఆ అధికారికి ఫోన్ లోనే లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చింది. అతడిని కడిగిపారేసింది. దీనికి సంబంధించి ఇద్దరి మధ్య జరిగిన ఫోన్ సంభాషణ గురువారం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సదరు సూపరింటెండెంట్ తనను ఎలా వేధించింది ఆ సంభాషణలో బాధితురాలు వెల్లడించింది. కూతురు వయసున్న ఆమె పట్ల ఆ వైద్యాధికారి వేధింపులపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

కొంతకాలంగా ఈ వ్యవహారం నడుస్తున్నా బయటికి చెప్పుకోడానికి హౌజ్ సర్జన్లు, డాక్టర్లు భయపడుతున్నారని తెలుస్తోంది. ఈ వ్యవహారం తమ తల్లిదండ్రులకు తెలిస్తే చదువు మాన్పించేస్తారని పలువురు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. మొత్తంగా ఈ ఆడియో టేపు బయటకు రావడంతో ఉన్నతాధికారి కీచక పర్వం వెలుగులోకి వచ్చింది. కీచక సూపరింటెండెంట్‌పై చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ బలంగా వినిపిస్తోంది.

రెండేళ్ల క్రితం కుడా ఓ వైద్య విద్యార్ధినితో,  పాఠాలు చెప్పాల్సిన ప్రోఫెసర్ అసభ్యంగా మాట్లాడటం… ఆమె బంధువులు అతడికి దేహశుధ్ది చేయటం జరిగింది. ఆఘటన మరువక ముందే ఇప్పుడు జీజీహెచ్ సూపరింటెండెంట్ మరో విద్యార్ధినిపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన సంచటలనం రేపటంతో రాష్ట్ర మహిళా కమీషన్ ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుంది.  జిల్లా ఇన్‌ఛార్జి కలెక్టర్ హరేంద్రప్రసాద్ ఈఘటనపై విచారణకు ఆదేశించారు.