ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం 

ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. 

  • Edited By: veegamteam , January 11, 2019 / 04:38 AM IST
ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం 

ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. 

ఢిల్లీ : ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. గురువారం అర్ధరాత్రి కీర్తినగర్ ఫర్నిచర్ మార్కెట్ లో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో వంద పూరి గుడిసెలు దగ్ధం అయ్యాయి. ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. ఆస్తి నష్టం లక్షల్లో సంభవించినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఘటనాస్థలికి చేరుకున్న ఫైర్ సిబ్బంది 30 ఫైర్ ఇంజన్లతో మంటలార్పారు.

గురువారం అర్ధరాత్రి దాటిన తరువాత పశ్చిమ ఢిల్లీలోని కీర్తి నగర్‌లో ఫర్నీచర్‌ దుకాణం నాలుగో అంతస్తులో మంటలు చెలరేగాయి. క్రమంగా పక్కనే ఉన్న మురికివాడకు మంటలు వ్యాపించాయి. 100 ఇల్లు దగ్ధమయ్యాయి. దీంతో అక్కడి వారంతా నిరాశ్రయులయ్యారు. ఫర్నీచర్‌  దుకాణంలో భారీగా మంటలు అంటుకోవడంతో ఆస్తి నష్టం లక్షల్లో సంభవించినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 30 అగ్నిమాపక యంత్రాలతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ప్రమాదంలో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. రైల్వే లైన్ పక్కనే మంటలు చెలరేగడంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మూడు గంటలపాటు రైళ్లు నిలిచిపోయాయి. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.