Director Liju Krishna : సినీ దర్శకుడిపై అత్యాచార ఆరోపణలు-అరెస్ట్

అత్యాచార ఆరోపణలు ఎదుర్కోన్న మలయాళ చిత్ర దర్శకుడు లిజు కృష్ణను పోలీసులు అరెస్ట్ చేశారు. నవిన్ పాలీ హీరోగా నటిస్తున్న పడవెట్టు సినిమాకు లిజు కృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు.

Director Liju Krishna : సినీ దర్శకుడిపై అత్యాచార ఆరోపణలు-అరెస్ట్

Director Liju Krishna

Director Liju Krishna :  అత్యాచార ఆరోపణలు ఎదుర్కోన్న మలయాళ చిత్ర దర్శకుడు లిజు కృష్ణను పోలీసులు అరెస్ట్ చేశారు. నవిన్ పాలీ హీరోగా నటిస్తున్న పడవెట్టు సినిమాకు లిజు కృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు.

ఈ చిత్ర యూనిట్ లోని ఒక యువతి దర్శకుడిపై  కాకనాడ ఇన్పో పార్క్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్శకుడు లిజు కృష్ణను ఆదివారం మార్చి 6వ తేదీన అరెస్ట్ చేశారు. దీంతో షూటింగ్ వాయిదా పడింది.
Also Read : Brother Anil Kumar : ‘బ్రదర్ అనిల్‌‍తో సమావేశమై బాధను విన్నవించుకున్నాం’

ప్రస్తుతం కేరళలోని కన్నూరులో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఈ ఏడాది పడవెట్టు సినిమా రిలీజ్ చేయాలని అవుకున్నారు. పడవెట్టు సినిమాకు లిజుకృష్ణనే కధ రాసుకున్నాడు. ఇందులో నవీన్ పాలీతోపాటు మంజువారియర్, అదితి బాలన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. గతంలో మూమెంట్ జస్ట్ బిఫోర్ డెత్ అనే సినిమాకు దర్శకత్వ వహించిన సన్నీవేన్ ఈ సినిమాను నిర్నిస్తున్నారు.

కాగా… కేరళలో అత్యాచార కేసులు వెలుగు చూస్తూనే ఉన్నాయి. ఆరుగురు మహిళలపై అత్యాచారం చేశాడనే ఆరోపణలతో కొచ్చిలో శనివారం టాటూ ఆర్టిస్ట్ సుజీష్ ను అరెస్ట్ చేశారు.
Also Read : Kochi Tattoo Artist : టాటూలు వేసే నెపంతో ఏడుగురు మహిళలపై అత్యాచారం
కొద్ది రోజుల క్రితం బాధితురాలు సోషల్ మీడయాలో పోస్ట్ చేయటంతో ఈ విషయం బయటకు పొక్కింది. తనపై ఫిర్యాదు అందటంతో పరారీలో ఉన్న సుజీష్ ను శనివారం రాత్రి తన లాయర్ కార్యాలయానికి వెళుతుండగా పోలీసులు అరెస్ట్ చేశారు.