అపార్ట్ మెంట్లో కుళ్లిపోయిన మృతదేహం లభ్యం 

  • Published By: murthy ,Published On : May 25, 2020 / 04:35 AM IST
అపార్ట్ మెంట్లో కుళ్లిపోయిన మృతదేహం లభ్యం 

హైదరాబాద్  దోమల గూడ లోని ఒక అపార్ట్ మెంట్ లో కుళ్లిపోయిన స్ధితిలో ఉన్న మృతదేహాన్ని గుర్తించారు. రోడ్ నెంబరు 10లోని గగన్ విహార్ అపార్ట్ మెంట్ లో, ఫ్లాట్ నెంబరు 9 లో నవీన్ కుమార్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు.  ఆదివారం ఉదయం అతడి  అపార్ట్ మెంట్ లోంచి దుర్వాసన రావటం గమనించారు ఆపార్ట్ మెంట్ వాసులు.

ఈ విషయాన్ని కుమార్  పాయల్ అనే వ్యక్తి పోలీసులకు, నవీన్ సోదరుడు నితేశ కు సమాచారం ఇచ్చాడు. ఘటనా స్ధలానికి వచ్చిన పోలీసులు తలుపులు తెరిచి చూడగా , నవీన్ కుమార్ మృతదేహం కుళ్లిపోయిన స్ధితిలో పడి ఉంది.నాలుగు రోజుల క్రితమే నవీన్ కుమార్ మరణించి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకుని పోలీసుల  దర్యాప్తు చేస్తున్నారు.

Read: మహిళా డాక్టర్ ను వేధించిన కేసులో హోం గార్డు సస్పెండ్