మహిళా డాక్టర్ బట్టలు మార్చుకుంటుంటే వీడియో తీసిన మేల్ నర్స్

మహిళా డాక్టర్ బట్టలు మార్చుకుంటుంటే వీడియో తీసిన మేల్ నర్స్

male nurse arrested for secretly filming female workers and doctors dress changing in room at bengaluru : బెంగుళూరులోదారుణం జరిగింది. రోగుల ప్రాణాలు కాపాడే మహిళా డాక్టర్ మానానికి రక్షణ లేకుండా పోయింది.  లేడీ డాక్టర్ డ్రస్ చేంజ్ చేసుకుంటూ ఉండగా ఆస్పత్రిలో పనిచేసే మేల్ నర్స్ ఆ దృశ్యాలను  తన సెల్ ఫోన్ లో రికార్డు చేసిన ఉదంతం బెంగుళూరులో వెలుగు చూసింది.

బెంగుళూరులోని సంజయ్ గాంధీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ట్రామా అండ్ ఆర్థోపెడిక్స్ ఆస్పత్రిలో పని చేసేలేడీ డాక్టర్(28) ఒకరు…. ఫిబ్రవరి 19న తన వృత్తిలో  భాగంగా ఆపరేషన్ ధియేటర్ కు వెళ్ళే ముందు బట్టలు మార్చుకోటానికి డ్రెస్సింగ్ రూంలోకి వెళ్ళారు.

బట్టలు మార్చుకుని తిరిగి వస్తుండగా గదిలో ఓ మూల ఆమెకు మొబైల్ ఫోన్ కనిపించింది. దాన్నితీసుకుని పరీక్షించి చూడగా ఆ ఫోన్ రికార్డింగ్ మోడ్ లో ఆన్ అయి ఉండటంతో షాక్ కు గురైంది. అప్పటిదాకా తాను బట్టలు మార్చుకున్నదృశ్యాలు ఆ సెల్ ఫోన్లో రికార్డు అయి ఉన్నాయి.

వెంటేనే ఆమె ఈ విషయాన్ని ఆస్పత్రి ఉన్నతాధికారులకు, తన సహోద్యోగులకు ఫిర్యాదు చేశారు. ఆఫోన్ ఆస్పత్రిలో ఔట్ సోర్సింగ్ లో పని చేసే మారుతేశా (31) అనే మగ నర్సుది గా గుర్తించారు.

ఆస్పత్రి డైరెక్టర్ హెచ్ఎస్ చంద్రశేఖర్, ఈవిషయాన్ని తిలక్ నగర్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మారుతేశ్ ను అదుపులోకి తీసుకుని ఫోన్ ను పరిశీలించారు.

అందులో మరి కొందరు మహిళా డాక్టర్లు, నర్సుల వీడియోలు లభించాయి. రీసైకిల్ బిన్ నుంచి మరి కొన్ని వీడియోలు పోలీసులు సాంకేతికంగా బయటకు తీశారు. మారుతేశ్ ఈ నీచ కార్యక్రమాన్ని ఎప్పటినుంచో చేస్తున్నట్లు తెలిసింది.

కాగా తాను తీసిన వీడియోలను మారుతేశ్ ఏమి చేస్తున్నాడనేది పెద్ద ప్రశ్నగా మారింది. వాటిని ఇంటర్నెట్ లో అప్ లోడ్ చేశాడా, లేక సోషల్ మీడియాలో వైరల్ చేశాడా అనేవిషయాన్ని పోలీసులు విచారిస్తున్నారు.

నిందితుడిపై ఐపీసీ సెక్షన్ 354సీ, 201, కింద కేసు నమోదు చేశారు. నిందితుడ్ని మెజిస్ట్రేట్ ముందు హాజరు పరచగా అతడ్ని జ్యూడీషియల్ రిమాండ్ కు తరలించారు.