Man blackmail ex-girlfriend : బ్యాంకు రుణం చెల్లించటానికి మాజీ ప్రియురాలిని బ్లాక్ మెయిల్ చేసిన వ్యక్తి అరెస్ట్

బ్యాంకు నుండి తీసుకున్న రుణం చెల్లించాలని, అధికారులు ఒత్తిడి చేశారు. రుణం చెల్లించేందుకు మాజీ ప్రియురాలిని బ్లాక్ మెయిల్ చేసి ఆమె వద్ద డబ్బులు దండుకున్న ప్రియుడ్నిఅరెస్ట్ చేసిన ఘటన ఢిల్లో చోటు చేసుకుంది.

Man blackmail ex-girlfriend : బ్యాంకు రుణం చెల్లించటానికి మాజీ ప్రియురాలిని బ్లాక్ మెయిల్ చేసిన వ్యక్తి అరెస్ట్

Black Mail

man arrested for blackmailing ex-girlfriend : బ్యాంకు నుండి తీసుకున్న రుణం చెల్లించాలని, అధికారులు ఒత్తిడి చేశారు. రుణం చెల్లించేందుకు మాజీ ప్రియురాలిని బ్లాక్ మెయిల్ చేసి ఆమె వద్ద డబ్బులు దండుకున్న ప్రియుడ్నిఅరెస్ట్ చేసిన ఘటన ఢిల్లో చోటు చేసుకుంది.

పాత ఢిల్లీలో నివసించే శుభం శర్మ అనే వ్యక్తి గతంలో సీమాపురి లోనివసించే ఒక మహిళతో ప్రేమాయణం సాగించాడు. కాలక్రమంలో వారిద్దరి మధ్య అభిప్రాయ బేధాలు వచ్చి ఇద్దరూ దూరం అయ్యారు.

అనంతరం ఆమెను మర్చిపోలేని  శర్మ వేరే నెంబరు తో,  కొత్త వ్యక్తి గా పరిచయం చేసుకుని ఆమెతో చాటింగ్ చేయటం ప్రారంభించాడు. ఆమె కూడా కొత్త వ్యక్తిగానే భావించి చాటింగ్ చేయసాగింది. ఈక్రమంలో ఆమె ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్ నుంచి ఆమెకు సంబంధించిన పలు ఫోటోలు వీడియోలు డౌన్లోడు చేసి పెట్టుకున్నాడు.

శర్మ గతంలో తీసుకున్న బ్యాంకు రుణానికి సంబంధించి, రుణం తిరిగి చెల్లించాలని అధికారులు వత్తిడి తెచ్చారు. బ్యాంకుకు డబ్బు చెల్లించే పరిస్ధితి లేకపోవటంతో బుధ్ధి వక్రమార్గాన పట్టింది. మాజీ ప్రియురాలిని బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు కొట్టేయాలనుకున్నాడు. అనుకున్నదే తడువుగా ఆమెకు మెసేజ్  చేశాడు. ఆమెకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని బెదిరించాడు.

దీంతో భయపడిన మాజీ ప్రియురాలు అతనికి రూ.15 వేలు చెల్లించింది. అతను మళ్లీ డబ్బులు డిమాండ్ చేయటంతో.. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. బాధిత మహిళకు వచ్చిన ఫోన్ నెంబరు ఆధారంగా నిందితుడ్ని గుర్తించారు.

శర్మ ఇచ్చిన ఫోన్ నెంబరు ఆధారంగా పోలీసులు అతడి గురించి గాలింపు చేపట్టారు. ఆఫోన్ నెంబరు కూడా తప్పుడు సమాచారంతో తీసుకున్నట్లు పోలీసులుగుర్తించారు.  నిందితుడిని ఆమె మాజీ ప్రియుడు శుభం శర్మగా  పోలీసులు బాధిత మహిళకు చెప్పారు.

బాధిత మహిళ ఇచ్చిన ఆధారాల ద్వారా నిందితుడ్ని పాత ఢిల్లీలో అదుపులోకి తీసుకున్నారు. బ్యాంకు లోన్ కట్టటానికే మాజీ ప్రియురాలిని బెదిరించినట్లు  ప్రాధమికంగా  అంగీకరించాడు.  కేసు విచారణ జరుగుతోంది.