సోషల్ మీడియా ఫోటోలతో 100 మంది మహిళలను బ్లాక్ మెయిల్ చేసిన యువకుడు అరెస్ట్

సోషల్ మీడియా ఫోటోలతో 100 మంది మహిళలను బ్లాక్ మెయిల్ చేసిన యువకుడు అరెస్ట్

Man arrest For ‘Blackmailing’ Over 100 Women On Social Media : సాంకేతిక పరిజ్ఞానం పెరిగాక నేరాలు అదే స్ధాయిలో పెరిగిపోతున్నాయి.స్మార్ట్ ఫోన్ చేతిలో ఉంటే ఫ్రపంచం మొత్తం మీ చేతిలోనే అనేవారు. అలాగే కొన్ని సంవత్సరాలుగా బహుళ ఫ్రాచుర్యంలోకి వచ్చిన సోషల్ మీడియా ప్లాట్ ఫాంలలో పోస్ట్ చేసుకున్నపర్సనల్ ఫోటోలు డౌన్లోడు చేసి వాటిని అసభ్యంగా మార్ఫింగ్ చేసి వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని మహిళలను బ్లాక్ మెయిల్ చేస్తున్న వ్యక్తిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు.

నోయిడాకు చెందిన సుమిత్ ఝా (26) అనే వ్యక్తి మహిళల సోషల్ మీడియా ఎకౌంట్ల నుంచి వారి ఫోటోలను కాపీ చేసేవాడు. వాటిని అసభ్యంగా మార్ఫింగ్ చేసి వారిపేరుతోనే ఫేక్ ఎకౌంట్లు క్రియేట్ చేసేవాడు. ఆ ఫోటలను వారికి పంపి ఫోన్ చేసి తాను అడిగినంత డబ్బులు ఇవ్వాలని లేకపోతే మార్ఫింగ్ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని బెదిరించేవాడు. ఇదే క్రమంలో ఇటీవల ఒక బ్యాంకు మేనేజర్ గా పని చేస్తున్న మహిళకు కూడా ఫోవ్ చేసి ఫోటోలు మార్ఫింగ్ చేసి… డబ్బులు ఇవ్వాలని బెదరించాడు. ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని పట్టుకునేందుకు రంగంలోకి దిగారు, పోలీసులకు దొర్కకుండా ఉండేందుకు నిందితుడి వాట్సాప్‌ ద్వారా వీఓఐపీ కాల్స్, వేరే యాప్స్‌ ద్వారా బెదిరింపులకు దిగేవాడు. నిందితుడిని పట్టుకోవటం కాస్త కష్టంగా మారటంతో , సర్వీసు ప్రోవైడర్ సహకారంతో, సాంకేతికంగా ఆధారాలు సేకరించి, నిందితుడిపై ఇన్పార్మర్ల నిఘా పెట్టి మంగళవారం అరెస్ట్ చేశారు.

నిందితుడిని గతంలో ఇటువంటి కేసుల్లో చత్తీస్ ఘడ్, నోయిడా పోలీసులు అరెస్ట్ చేసినట్లు దక్షిణ ఢిల్లీ డీసీపీ అతుల్ ఠాకుర్ చెప్పారు, నిందితుడు ఇప్పటి వరకు బ్లాక్ మెయిలింగ్ కు పాల్పడి దాదాపు 100 మంది మహిళలను బెదిరించి వారి వద్దనుంచి డబ్బులు వసూలు చేసినట్లు ఆయన తెలిపారు.