ట్రంప్ ను చంపేస్తా..కత్తితో వైట్ హౌస్ దగ్గర యువకుడు

ట్రంప్ ను చంపేస్తా..కత్తితో వైట్ హౌస్ దగ్గర యువకుడు

డొనాల్డ్ చంపాలని ఫ్లాన్ చేసిన ఓ యువకుడిని అమెరికా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆదివారం అమెరికా అధ్యక్షుడి అధికార నివాసం వైట్ హౌస్ బయట ఓ కత్తి పట్టుకుని నిలబడి.. ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్‌ను చంపడానికొచ్చానంటూ బ్రాడెన్టంన్ కు చెందిన జర్ హెడ్జ్‌పెత్ అనే 25ఏళ్ల యువకుడు షాకింగ్ కామెంట్స్ చేశాడు.

వెంటనే భద్రతా దళాలు  అలర్ట్ అయ్యాయి. యూఎస్ సీక్రెట్ సర్వీస్‌కు చెందిన ఓ అధికారి అతన్ని సమీపించాడు. ఇక్కడెందుకున్నావని రోజర్‌ను ప్రశ్నించాడు. దీనికి సమాధానంగా తాను ట్రంప్‌ ను హత్య చేయడానికి వచ్చానని, ఓ కత్తి కూడా తెచ్చుకున్నానని రోజర్ చెప్పాడు. దీంతో వెంటనే అతన్ని అదుపులోకి తీసుకున్న సదరు అధికారి రోజర్ దగ్గర నుంచి 3.5 అంగుళాల కత్తిని స్వాధీనం చేసుకున్నాడు.

అతడి దగ్గర ఓ ఖాళీ పిస్టోల్ కూడా ఉన్నట్లు గుర్తించారు. వెంటనే అతడిని అరెస్ట్ చేసి..ఆ తర్వాత రోజర్‌ మానసిక స్థితి సరిగా లేదని భావించి దగ్గరలోని ఓ హాస్పిటల్ కు తరలించారు. తదుపరి నోటీసులు వచ్చే వరకు అతను హాస్పిటల్ లో ఉంటాడని అధికారులు తెలిపారు.