Man Beaten to Death In Public: సోదరుడి హత్యపై ప్రతీకారంతో వెళ్లి.. బహిరంగ ప్రదేశంలో దారుణ హత్యకు గురయ్యాడు

రాహుల్, అజయ్, ముకేష్, ఇతరులు కలిసి కర్రలు, రాడ్లతో సునిల్‭ను విపరీతంగా కొట్టి అక్కడి నుంచి పారిపోయారు. స్థానికులు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు అక్కడికి వచ్చి తీవ్ర గాయాలతో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న సునిల్‭ను ఆసుపత్రికి తరలించే ప్రతయ్నం చేశారు. అయితే ఆసుపత్రికి వెళ్లేలోపే మరణించినట్లు పోలీసులు తెలిపారు

Man Beaten to Death In Public: సోదరుడి హత్యపై ప్రతీకారంతో వెళ్లి.. బహిరంగ ప్రదేశంలో దారుణ హత్యకు గురయ్యాడు

Man Beaten to Death In Public In Delhi

Man Beaten to Death In Public: తన సోదరుడిని చంపిన వ్యక్తులపై పగ తీర్చుకోవడానికి వెళ్లిన వ్యక్తి పట్టపగలు, అందరూ చూస్తుండగా దారుణ హత్యకు గురయ్యాడు. దేశ రాజధాని ఢిల్లీలో ఉన్న తిమర్పూర్ ప్రాంతంలో ఆగస్టు 13న ఈ ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. ఈ ఘటన అంతా సీసీటీవీ కెమెరాల్లో రికార్డైంది. చనిపోయిన వ్యక్తి సునిల్ గిన్ని(31) అని, ఈ హత్యకు పాల్పడిన నేరస్తులను 24 గంటల్లోనే అరెస్ట్ చేసినట్లు ఢిల్లీ పోలీసులు పేర్కొన్నారు.

ఈ ఘటనకు సబంధించిన వీడియో సోషల్ మీడియాలో సైతం చక్కర్లు కొడుతోంది. చనిపోయిన వ్యక్తి సునీల్ రౌడీ షీటర్. ఈ దారుణ హత్యకు పాల్పడ్డ ఐదుగురిపై క్రిమినల్ కేసులు నమోదై ఉన్నాయి. కాగా, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొద్ది రోజుల క్రితం సునిల్ సోదరుడిని రాహుల్, అజయ్, ముకేష్, మరికొంత మంది హత్య చేశారు. ఈ హత్యకు ప్రతీకారంగా సునీల్ ఒక కొడవలి తీసుకుని బయల్దేరాడు. బహిరంగ ప్రదేశంలో ఉన్న రాహుల్, అజయ్, ముకేష్‭లపై దాడి చేయబోయాడు.

ఇంతలో సునిల్ నుంచి కొడవలిని లాక్కున్నారు. రాహుల్, అజయ్, ముకేష్, ఇతరులు కలిసి కర్రలు, రాడ్లతో సునిల్‭ను విపరీతంగా కొట్టి అక్కడి నుంచి పారిపోయారు. స్థానికులు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు అక్కడికి వచ్చి తీవ్ర గాయాలతో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న సునిల్‭ను ఆసుపత్రికి తరలించే ప్రతయ్నం చేశారు. అయితే ఆసుపత్రికి వెళ్లేలోపే మరణించినట్లు పోలీసులు తెలిపారు. హత్యకు పాల్పడ్డ నేరస్తులపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Sanitiser Foils Cheating: రైల్వే ఎగ్జామ్ కోసం తన బొటనవేలి తోలు తొలగించి ఫ్రెండ్‭కు అతికించిన అభ్యర్థి.. ఈ తర్వాత ఏమైందంటే..?