అట్టర్ ప్లాప్: పోలీసు స్టేషన్ కే కన్నం వేయబోయాడు!
దొంగతనం చేయడం కూడా ఒక ఆర్టే. అది అందరికి వర్క్ ఔట్ కాదు. దొంగతనం చేయడంలోనూ నేర్పు ఉండాలి. లేదంటే ఇలానే అడ్డంగా దొరికిపోతారు. దొంగతనం కొత్తేమో పాపం ఇతగాడికి.. పోయి పోయి పోలీసు స్టేషన్ కే కన్నం వేయాలనుకున్నాడు.

దొంగతనం చేయడం కూడా ఒక ఆర్టే. అది అందరికి వర్క్ ఔట్ కాదు. దొంగతనం చేయడంలోనూ నేర్పు ఉండాలి. లేదంటే ఇలానే అడ్డంగా దొరికిపోతారు. దొంగతనం కొత్తేమో పాపం ఇతగాడికి.. పోయి పోయి పోలీసు స్టేషన్ కే కన్నం వేయాలనుకున్నాడు. కళ్లకు, ముఖానికి మాస్క్ ధరించాడు. వెంట ఓ ఆయుధం తెచ్చుకున్నాడు. ఏం దొరకనట్టు పోలీసు స్టేషన్ దగ్గర సైకిల్ దొంగతనం చేసేందుకు యత్నించాడు. సైకిల్ లాక్ తెరిచేందుకు యత్నించి చివరికి చేతులేత్తేశాడు.
ఇంతలో అలర్ట్ అయిన పోలీసులు వెంటనే డోర్ తెరిచి గన్ గురిపెట్టడంతో లొంగిపోయాడు. ఈ ఘటన అమెరికాలోని గ్లాడ్ స్లోన్ పోలీసు స్టేషన్ దగ్గర చోటుచేసుకుంది. సీసీ కెమెరాలో రికార్డు అయిన ఈ దృశ్యం ఇప్పుడు సోషల్ మీడియాలోనూ వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు.. అయ్యో.. ఈ దొంగకు దొంగతనం కూడా చేయరాదే అంటూ పన్నీ కామెంట్లు పెడుతున్నారు.