Loan App Harassment : లోన్ యాప్ వేధింపులకు మరొకరు బలి.. ఫోటోలు మార్ఫింగ్ చేసి భార్యకు పంపడంతో

లోన్ యాప్ నిర్వాహకుల వేధింపులకు మరో యువకుడు బలయ్యాడు. తీసుకున్న రుణం చెల్లించకపోవడంతో రాజేశ్ ఫొటోలు మార్ఫింగ్ చేసి లోన్ యాప్ నిర్వాహకులు వేధించారు. తన భార్యకు మార్ఫింగ్ చేసిన ఫొటోలు లోన్ యాప్ నిర్వాహకులు పంపించడంతో తీవ్ర మనస్తాపానికి గురైన రాజేశ్ ఆత్మహత్య చేసుకున్నాడు.

Loan App Harassment : లోన్ యాప్ వేధింపులకు మరొకరు బలి.. ఫోటోలు మార్ఫింగ్ చేసి భార్యకు పంపడంతో

Loan App Harassment : లోన్ యాప్ నిర్వాహకుల వేధింపులకు మరో యువకుడు బలయ్యాడు. తీసుకున్న రుణం చెల్లించకపోవడంతో రాజేశ్ ఫొటోలు మార్ఫింగ్ చేసి లోన్ యాప్ నిర్వాహకులు వేధించారు. తన భార్యకు మార్ఫింగ్ చేసిన ఫొటోలు లోన్ యాప్ నిర్వాహకులు పంపించడంతో తీవ్ర మనస్తాపానికి గురైన రాజేశ్ ఆత్మహత్య చేసుకున్నాడు.

లోన్ యాప్ నిర్వాహకులపై భవానీపురం పోలీస్ స్టేషన్ లో కుటుంబసభ్యులు ఫిర్యాదు చేశారు. పోస్టుమార్టం కోసం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి మార్చురికి డెడ్ బాడీని పోలీసులు తరలించారు. భవానీపురం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాఫ్తు చేస్తున్నారు.

Also Read..Online Loan Apps Harassment : వద్దన్నా లోన్ ఇచ్చి వేధింపులు.. శృతి మించుతున్న ఆన్‪లైన్ లోన్ యాప్‌ల అరాచకాలు

తన భర్త మరణానికి లోన్ యాప్ నిర్వాహకుల వేధింపులే కారణమని రాజేశ్ భార్య రత్నకుమారి ఆరోపించారు. తన భర్త చావుకి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని ఆమె డిమాండ్ చేశారు.

”లోప్ యాప్ నుంచి రుణం తీసుకున్నట్లు కానీ, లోన్ యాప్ నిర్వాహకులు వేధిస్తున్నట్లు కానీ.. నా భర్త ఎప్పుడూ నాతో చెప్పలేదు. వేధిస్తున్నారని చెప్పి ఉంటే పరిష్కారం చూసేదాన్ని. ఆయన ఆత్మహత్య చేసుకునే వరకు వెళ్లనిచ్చే దాన్ని కాదు. ఏదో ఒక పరిష్కారం ఆలోచించేదాన్ని. ఎవరో ఒకరి దగ్గర డబ్బు తీసుకొచ్చి కట్టేదాన్ని. ఇలా జరుగుతుందని అస్సలు ఊహించలేదు. లోన్ యాప్ నిర్వాహకులు వేధిస్తున్నారని ఆత్మహత్య చేసుకోవడానికి అరగంట ముందు చెప్పారు. ఇలాంటి పరిస్థితి ఎవరికీ రాకూడదు.

ఆయన తన ఫోటోలను యాప్ లో పంపారు. ఆ ఫోటోలను వేరే అమ్మాయిలతో ఉన్నట్లు మార్ఫింగ్ చేసి అందరికీ పంపుతామని బ్లాక్ మెయిల్ చేశారు. తన పరువు పోతుందని భయపడి నా భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. నా భర్త ఎస్ఐయూకేలో మార్కెటింగ్ చేశాడు. అబ్రాడ్ ఎడ్యుకేషన్ లో. 2013లో మేము పెళ్లి చేసుకున్నాం. నాతో నా భర్త బాగుంటాడు. ఏదైనా చెబుతాడు. డబ్బులు విషయానికి వచ్చేసరికి నాకు చెప్పలేదు.

Also Read..Loan App Harassment : తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ పెరుగుతున్న లోన్‌యాప్ ఆగడాలు..బలైపోతున్న ప్రాణాలు

నేను సూసైడ్ చేసుకుంటాను. నువ్వు మీ వాళ్ల దగ్గరికి వెళ్లిపో. ఇక్కడ ఉండొద్దు. నా అకౌంట్ లో పడే శాలరీ నువ్వే తీసుకో అని చెప్పారు. నా మీద కోపంతో అలా మాట్లాడి ఉంటాడని నేను అనుకున్నా. కానీ, ఆయన ఇలా చేస్తాడని కలలో కూడా అనుకోలేదు. లోన్ యాప్ నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలి. నేను నా భర్తను కోల్పోయాను. లోన్ యాప్ గురించి నాకు తెలుసుంటే ఆ డబ్బుని కట్టేపించేదాన్ని.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

ఎక్కడైనా అప్పు తీసుకొచ్చి అయినా డబ్బు కట్టేసేదాన్ని. కానీ, నా భర్త నాకు ఏ విషయమూ చెప్పలేదు. ఇలాంటి పరిస్థితి ఏ మహిళకు రాకూడదు. మనిషిని కోల్పోవడం అంటే ప్రాణం పోయినంత బాధగా ఉంటుంది” అని మృతుదు రాజేశ్ భార్య కన్నీరుమున్నీరుగా విలపించారు.