Black Magic : యూట్యూబ్‌లో చూసి.. ప్రేమించిన అమ్మాయి ఇంటి ముందు చేతబడి.. ఎందుకో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..

తమ ప్రేమను కాదన్న కోపంతో అబ్బాయిలు ప్రేమోన్మాదులుగా మారి అమ్మాయిలపై యాసిడ్ పోయడాలు, కత్తులతో దాడి చేసి వారిని చంపిన దారుణాలు చాలానే విన్నాం, చూశాం కూడా. కానీ అమ్మాయి తన ప్రేమను తిరస్కరించిందని ఓ ప్రబుద్దుడు చేసిన పని అందరిని విస్మయానికి గురి చేసింది. ఆమె పెళ్లి చేసుకుని వెళ్లిపోయినా వదలకుండా...

Black Magic : యూట్యూబ్‌లో చూసి.. ప్రేమించిన అమ్మాయి ఇంటి ముందు చేతబడి.. ఎందుకో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..

Black Magic

Black Magic : తమ ప్రేమను కాదన్న కోపంతో అబ్బాయిలు ప్రేమోన్మాదులుగా మారి అమ్మాయిలపై యాసిడ్ పోయడాలు, కత్తులతో దాడి చేసి వారిని చంపిన దారుణాలు చాలానే విన్నాం, చూశాం కూడా. కానీ అమ్మాయి తన ప్రేమను తిరస్కరించిందని ఓ ప్రబుద్దుడు చేసిన పని అందరిని విస్మయానికి గురి చేసింది. ఆమె పెళ్లి చేసుకుని వెళ్లిపోయినా వదలకుండా మంత్రాలతో లొంగదీసుకోవాలని యత్నించి అడ్డంగా బుక్కయ్యాడు ఓ ప్రబుద్ధుడు. ఆమె మెట్టినింటి ముందు చేతబడి చేయడంతో కుటుంబ సభ్యులు బెంబేలెత్తిపోయారు. ప్రేమోన్మాది చేష్టలతో కుటుంబసభ్యులు, స్థానికులు ఇబ్బందిపడ్డారు. ఈ షాకింగ్ ఘటన నల్గొండలో కలకలం రేపింది.

నల్గొండకు చెందిన మురళికి కొన్నిరోజుల క్రితం రాంగ్‌ కాల్‌లో యువతి పరిచయమైంది. ఇద్దరి మధ్య స్నేహం కుదరడంతో అప్పుడప్పుడూ కాల్స్ చేసుకునేవారు. ఇంతలో నిన్ను ప్రేమిస్తున్నాననంటూ మురళి చెప్పడంతో ఆమె సున్నితంగా తిరస్కరించింది. తనకు అలాంటి ఉద్దేశం లేదని తేల్చి చెప్పేసింది. అయినా వదలని మురళి ఆమెను నీడలా వెంటాడడం మొదలుపెట్టాడు. ఆమెకు ఇటీవల పెళ్లైంది. ఈ విషయం తెలిసి మురళి మరింత రగిలిపోయాడు. నేరుగా ఆమె భర్తకే ఫోన్ చేసి బెదిరింపులకు దిగాడు.

అంతటితో ఆగని మురళి మంత్రశక్తితో ఆమెను వశం చేసుకోవాలనుకున్నాడు. యువతి మెట్టినింటి ముందు క్షుద్రపూజలకు పూనుకున్నాడు. ఇంటి ముందు ఎముకలు, నిమ్మకాయలు, కుంకుమ, గుడ్డముక్కలు సహా క్షుద్రపూజలకు వినియోగించే వస్తువులు ఉంచాడు. వాటిని చూసిన యువతి మెట్టినింటి వారు భయంతో బెంబేలెత్తిపోయారు. మురళి పిచ్చి చేష్టలతో విసిగిపోయిన బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడు మురళిని అరెస్టు చేశారు. యూట్యూబ్, ఫేస్‌బుక్‌లో చూసి క్షుద్రపూజలు చేర్చుకున్నట్టు మురళి చెప్పడంతో అంతా షాక్ అయ్యారు. వీడెవడండి బాబూ, ఇదేం ప్రేమరా నాయనో అని తల పట్టుకుంటున్నారు.