ఛీ..ఛీ..ఢిల్లీ మెట్రోలో యువతి ఎదుట..

  • Published By: madhu ,Published On : February 13, 2020 / 09:55 PM IST
ఛీ..ఛీ..ఢిల్లీ మెట్రోలో యువతి ఎదుట..

ఢిల్లీ మెట్రో మరోసారి వార్తల్లోకి ఎక్కింది. మెట్రో ఎక్కిన యువతికి దారుణమైన అనుభవం ఎదురైంది. ఊహించని ఘటనతో ఆమె షాక్‌కు గురయ్యింది. యువకుడు చేసిన నీచమైన పనికి ఆమె తేరుకోలేకపోయింది. అసహ్యమైన ఘటనను ట్విట్టర్ వేదికగా ఫిర్యాదు చేసింది. వరుస ట్వీట్లు చేయడంతో సోషల్ మీడియాతో వైరల్‌ అయ్యాయి. యువతికి ధైర్యం చెబుతూ..ఆ యువకుడిని పట్టుకోవాలని అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అప్పటి వరకు ఎందుకు వెయిట్ చేశారు..లాగి చెంప దెబ్బ కొట్టకపోయారా అంటూ సూచిస్తున్నారు. 

పని ముగించుకుని ఢిల్లీలో మెట్రోలో ఇంటికి వెళుతున్నట్లు యువతి వెల్లడించింది. గ్రే కలర్ జాకెట్ వేసుకున్న యువకుడు..అసభ్యకరంగా ప్రవర్తించాడని, అతని ప్రైవేటు పార్ట్ చూపిస్తూ..నీచంగా వ్యవహరించాడని వాపోయింది. ఈ ఘటనతో తాను షాక్‌కు గురైనట్లు తెలిపింది.

ఇదంతా 7th కోచ్‌లో జరిగిందని, తాను కూర్చొంటే..తనకు ఎదురుగానే వచ్చిన నిలబడి..అదే విధంగా ప్రవర్తించాడని ట్వీట్‌లో వెల్లడించింది. తాను ఏమీ చేయలేక..తలకిందకు వంచి నేలవైపే చూస్తూ ఉండిపోయానని తెలిపింది. ఎక్కడ దిగిపోయాడో తనకు తెలియదన్నారు. కానీ ఫొటో మాత్రం సంపాదించినట్లు..తెలిపింది. 

వెంటనే ఘటనకు సంబంధించిన విషయాన్ని తన ఫ్రెండ్‌కు తెలపగా..ధైర్యంగా పోలీసులకు కంప్లయింట్ చేయాలని సూచించడం జరిగిందన్నారు. ఘిటోర్నీ మెట్రో పోలీస్ స్టేషన్‌కు వెళ్లగా…అక్కడ లేడీ కానిస్టేబుల్ లేరని, దర్యాప్తు చేస్తామని, అతని పట్టుకుంటామని..మగ హెడ్ కానిస్టేబుల్ చెప్పినట్లు..ఎఫ్ఐఆర్ మాత్రం నమోదు చేయలేదని ట్వీట్ ద్వారా వెల్లడించింది. 

వెంటనే ఉమెన్ హెల్ప్ లైన్‌కు ఫోన చేసి వివరాలు చెప్పినట్లు, దీనికి సంబంధించిన కంప్లయింట్‌ను సమీప పీఎస్‌కు పంపించారన్నారు. అనంతరం ఘిటోర్నీ పీఎస్‌ నుంచి కాల్ వచ్చిందని, అక్కడున్న సబ్ ఇన్స్ పెక్టర్ కేసును ఫైల్ చేశారన్నారు. మొత్తం జరిగిన ఘటనను ట్విట్టర్ వేదిక ద్వారా ట్వీట్ చేశారు. 

దీనిపై ఢిల్లీ మెట్రో యాజమాన్యం స్పందించింది. వెంటనే టోల్ ఫ్రీ నెంబర్లకు ఫోన్ చేయాలని, తగిన చర్యలు తీసుకుంటామని వెల్లడించింది. ప్రస్తుతం పోలీసులు అతడిని పట్టుకోవడానికి గాలిస్తున్నారు.