కోరిక తీర్చలేదని మహిళను సజీవదహనం చేసిన నిందితుడికి యావజ్జీవం

తన కోరిక తీర్చాలని మహిళ వెంటపడిన వ్యక్తిని ఆ మహిళ తిరిస్కరించింది. అయినా కానీ ఆమెవెంటపడి వేధించసాగాడు. అయినా మహిళ ఒప్పుకోకపోవటంతో ఆమెనుకిరసనాయిల్ పోసి సజీవదహనం చేసిన నిందితుడికి మహబూబ్ నగర్ జిల్లాకోర్టు మంగళవారం షాద్ నగర్ కోర్టు యావజ్జీవ కారాగారశిక్షతో పాటు జరిమానా విధించింది.

కోరిక తీర్చలేదని మహిళను సజీవదహనం చేసిన నిందితుడికి యావజ్జీవం

man gets life imprisonment in murder case at mahaboobnagar district : తన కోరిక తీర్చాలని మహిళ వెంటపడిన వ్యక్తిని ఆ మహిళ తిరిస్కరించింది. అయినా కానీ ఆమెవెంటపడి వేధించసాగాడు. అయినా మహిళ ఒప్పుకోకపోవటంతో ఆమెనుకిరసనాయిల్ పోసి సజీవదహనం చేసిన నిందితుడికి మహబూబ్ నగర్ జిల్లాకోర్టు మంగళవారం షాద్ నగర్ కోర్టు యావజ్జీవ కారాగారశిక్షతో పాటు జరిమానా విధించింది.

మహబూబ్ నగర్ జిల్లా ఫరూక్ నగర్ మండలం ఎలికట్టకు చెందిన జంగం మంగమ్మ అనే మహిళను..జంగం రాములు అనే వ్యక్తి తన లైంగిక కోరిక తీర్చమని వెంటపడేవాడు.ఆమె అందుకు తిరిస్కరించింది. అయినా పట్టువిడవకుండా ఆమెను వేధించసాగాడు. అయినా ఆమె కనికరించలేదు. అసహనం పెరిగిపోయిన రాములు మంగమ్మను అంతమొందించాలనుకున్నాడు.

2019 మార్చి26న రోడ్డుపై నడుచచుకుంటూ వెళ్తున్న మంగమ్మ వెంటపడి తన కోరిక తీర్చమని అడిగాడు. ఆమె నుంచి నో అనే సమాధానం వచ్చింది. నా కోరిక తీర్చకపోతే నిన్ను బతకనివ్వను అని బెదిరించాడు. అయినా ఆమె చలించలేదు. దీంతో రాములు తన వెంట తెచ్చుకున్న కిరోసిన్ ఆమెపై పోసి నిప్పంటించాడు. అటుగా వెళ్తున్నవారు అది చూసి మంటలు ఆర్పి ఆమెను ఆస్పత్రికి తరలించారు.

అక్కడ ప్రాధమికి చికిత్స జరిపి మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తరలిస్తుండగా..మార్గమధ్యలోనే మరణించింది. కేసు నమోదు చేసుకున్న షాద్ నగర్ పోలీసులు విచారణ చేపట్టారు. న్యాయస్ధానంలో సాక్ష్యాధారాలు ప్రవేశపెట్టారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ 19 మంది సాక్షులను ప్రవేశ పెట్టారు. ఇరు పక్షాల వాదనలు విన్న తర్వాత…రాములు నేరస్ధుడిగా రుజువుకావడంతో న్యాయమూర్తి ఎస్ ప్రేమావతి..నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష తో పాటు …రూ. 5 వేల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు.