బంగ్లాదేశ్-టూ-బెంగుళూర్ వ్యభిచారం, ముగ్గురు అరెస్ట్

బంగ్లాదేశ్-టూ-బెంగుళూర్ వ్యభిచారం, ముగ్గురు అరెస్ట్

Man held for human trafficking at Kolkata airport : బంగ్లాదేశ్ యువతులతో బెంగుళూరులో వ్యభిచారం చేయించేందుకు తీసుకు వెళ్తున్న కోల్ కతా కు చెందిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇద్దరు మహిళలను రక్షించారు. కోల్ కతా కు చెందిన రోఫికల్ ఇస్లాం అనే వ్యక్తి ఇద్దరు యువతులతో కొల్ కత్తా నుంచి బెంగుళూరు వెళ్లటానికి విమానాశ్రయానికి వెళ్లాడు. కొద్దిసేపట్లో ఇండిగో విమానం ఎక్కి బెంగుళూరు వెళ్లబోతుండగా పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.

ఆసమయంలో కోల్ కతా విమానాశ్రయానికి వచ్చిన ఐక్యరాజ్యసమితి చిల్డ్రన్స్ ఫండ్ (యునిసెఫ్) లోని పిల్లల రక్షణ విభాగంలో పనిచేస్తున్న అధికారి గార్గి సాహా వీరిని గుర్తించారు. ఆయనకు వీరి ప్రవర్తనపై అనుమానం వచ్చి విమానాశ్రయం అధికారులకు ఫిర్యాదు చేశారు. వెంటనే వారు రోఫికల్ ఇస్లాంతో సహా యువతులను అదుపులోకి తీసుకుని విచారించారు.

యువతులిద్దరూ బంగ్లాదేశ్ కు చెందిన వారిగా గుర్తించారు. సరిహద్దుల మీదుగా వారిద్దరూ అక్రమంగా భారత్ లోకి చొరబడ్డారని భద్రతా సిబ్బంది విచారణలో తేలింది. ఇద్దరు అమ్మాయిలు రోఫికల్ ఇస్లాంతో కలిసి బెంగుళూరు వెళ్లటానికి ఇష్టపడటం లేదని విమానాశ్రయ భద్రతా అధికారి ఒకరు తెలిపారు.

వారిని ఎక్కడకు తీసుకువెళుతున్నావు….వారి వివరాలు ఏమిటని అడిగిన ప్రశ్నలకు రోఫికర్ సరైన సమాధానాలు ఇవ్వక పోవటంతో పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేశారు. ఈఘటనతో అప్రమత్తమైన అధికారులు…. బెంగుళూరు లో వ్యభిచారం చేసేందుకు బంగ్లాదేశ్ యువతులను అక్రమంగా తీసుకువచ్చారా అనే కోణంలో విచారణ చేస్తున్నారు.