karnataka: అమ్మాయి కోసం స్మార్ట్‌ఫోన్ కొట్టేద్దామ‌ని వెళ్ళి.. రాత్రంతా షోరూంలో మ‌హిళ‌ల బాత్రూంలో యువ‌కుడు

రాత్రి స‌మ‌యంలో మ‌హిళ‌ల బాత్రూం నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన ఆ యువ‌కుడు షోరూం మొత్తం తిరిగి ఏడు మొబైల్ ఫోన్లు జేబుల్లో పెట్టుకుని, మ‌ళ్ళీ మ‌హిళ‌ల బాత్రూంలోకి వెళ్ళి రాత్రంతా అక్క‌డే ఉన్నాడు. ఉద‌యాన్నే షోరూం తెర‌వ‌గానే బ‌య‌ట‌కు వ‌చ్చి పారిపోయాడు. చివ‌ర‌కు అత‌డిని పోలీసులు ప‌ట్టుకున్నారు.

karnataka: అమ్మాయి కోసం స్మార్ట్‌ఫోన్ కొట్టేద్దామ‌ని వెళ్ళి.. రాత్రంతా షోరూంలో మ‌హిళ‌ల బాత్రూంలో యువ‌కుడు

Thief

karnataka: ప్రేమించిన అమ్మాయికి స్మార్ట్‌ఫోన్‌ను బ‌హుమ‌తిగా ఇచ్చి స‌ర్‌ప్రైజ్ చేద్దామ‌ని అనుకున్నాడో ఓ యువ‌కుడు. అత‌డి వ‌ద్ద డ‌బ్బు మాత్రం లేదు. దీంతో మొబైల్ ఫోన్ల షోరూంలో స్మార్ట్‌ఫోన్‌ను కొట్టేసి, త‌న ప్రియురాలికి ఇవ్వాల‌ని భావించాడు. మొబైల్ ఫోన్ల‌ను ఎలా కాజేయాల‌ని ఇంట‌ర్నెట్‌లో సెర్చ్ చేసి తెలుసుకున్నాడు. అనంత‌రం ప్ర‌ణాళిక వేసుకుని రాత్రి స‌మ‌యంలో మొబైల్ ఫోన్ల‌ దుకాణంలోకి వెళ్ళి మ‌హిళ‌ల బాత్రూంలో దాక్కున్నాడు. ఆ దుకాణం సిబ్బంది అన్ని త‌లుపుల‌కి తాళాలు వేసి వెళ్ళిపోయారు.

మ‌హిళ‌ల బాత్రూం నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన ఆ యువ‌కుడు షోరూం మొత్తం తిరిగి ఏడు మొబైల్ ఫోన్లు జేబుల్లో పెట్టుకుని, మ‌ళ్ళీ మ‌హిళ‌ల బాత్రూంలోకి వెళ్ళి రాత్రంతా అక్క‌డే ఉన్నాడు. ఉద‌యాన్నే షోరూం తెర‌వ‌గానే బ‌య‌ట‌కు వ‌చ్చి పారిపోయాడు. దీంతో ఈ విష‌యాన్ని గుర్తించిన సిబ్బంది పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ఎట్ట‌కేల‌కు దొంగ‌ను ప‌ట్టుకున్నారు. ఈ ఘ‌ట‌న బెంగ‌ళూరులోని జేపీ న‌గ‌ర్‌లో చోటు చేసుకుంది. నిందితుడి పేరు అబ్దుల్ మునాఫ్ అని, అత‌డు స్థానికంగా ఉండే బీటీఎం లేఅవుట్‌లోని ఓ రెస్టారెంట్‌లో ప‌నిచేసేవాడ‌ని పోలీసులు తెలిపారు.

అత‌డు కాజేసి మొబైల్ ఫోన్ల ఐఎంఈఐ ద్వారా అత‌డిని ప‌ట్టుకున్నామ‌ని చెప్పారు. ఆ మొబైల్ ఫోన్ల‌లో ఇంట‌ర్నెట్ ఆన్ చేయ‌గానే అతడి ఆచూకీ తెలిసింద‌ని వివ‌రించారు. అత‌డు మంగ‌ళూరులో ఉండే ఓ అమ్మాయితో ఇన్‌స్టాగ్రామ్‌లో ప‌రిచయం చేసుకున్నాడ‌ని, ఆమెకు గిఫ్ట్ ఇచ్చి ఆక‌ర్షించ‌డానికి మొబైల్ ఫోన్లు చోరీ చేశాడ‌ని పోలీసులు తెలిపారు. అత‌డు చోరీ చేసిన ఫోన్ల విలువ దాదాపు రూ.5 ల‌క్ష‌లు ఉంటుంద‌ని చెప్పారు. ఆ ఫోన్ల‌లో ఒక‌టి తాను ప్రేమించిన అమ్మాయికి ఇచ్చిన అత‌డు మిత‌గా ఫోన్ల‌ను త‌న వ‌ద్దే ఉంచుకున్నాడ‌ని పోలీసులు తెలిపారు. అత‌డు బిహార్ నుంచి ప‌ని కోసం బెంగ‌ళూరుకు వ‌చ్చి ఇక్క‌డే నివ‌సిస్తున్నాడ‌ని చెప్పారు.

Monkeypox: భార‌త్‌లో తొలి మంకీపాక్స్ బాధితుడు పూర్తిగా కోలుకున్నాడు: కేర‌ళ ఆరోగ్య శాఖ మంత్రి