Kill : ప్రేమోన్మాదం.. తనకు దక్కనిది మరెవ్వరికీ దక్కకూడదని.. ప్రియురాలితో పాటు…

ఉత్తరప్రదేశ్ లో దారుణం జరిగింది. ప్రేమించిన అమ్మాయి పెళ్లికి నిరాకరించిందని ఓ వ్యక్తి ఉన్మాదిగా మారాడు. ప్రేయసితో పాటు ఆమె కుటుంబాన్ని...

Kill : ప్రేమోన్మాదం.. తనకు దక్కనిది మరెవ్వరికీ దక్కకూడదని.. ప్రియురాలితో పాటు…

Kill

Kill : ఉత్తరప్రదేశ్ లో దారుణం జరిగింది. ప్రేమించిన అమ్మాయి పెళ్లికి నిరాకరించిందని ఓ వ్యక్తి ఉన్మాదిగా మారాడు. ప్రేయసితో పాటు ఆమె కుటుంబాన్ని హతమార్చాడు. గోరఖ్ పూర్ కి చెందిన అశోక్ కుమార్, గోండా ప్రాంతానికి చెందిన స్వప్న ప్రేమించుకొంటున్నారు. అయితే, వీరిద్దరి కులాలు వేరు కావడంతో వీరి ప్రేమను పెద్దలు అంగీకరించలేదు. అంతేకాకుండా స్వప్నకు మరో అబ్బాయితో నిశ్చితార్థం జరిపించారు. దీంతో ప్రియుడు అశోక్ కోపంతో రగిలిపోయాడు.

Dinner : సూర్యాస్తమయానికి ముందే రాత్రి భోజనం ఎందుకంటే?

తనకు దక్కనిది మరెవ్వరికీ దక్కకూడదని ప్రియురాలిని హతమార్చడానికి ప్లాన్ వేశాడు. బుధవారం అర్ధరాత్రి 2 గంటల సమయంలో హెల్మెట్ పెట్టుకుని బైక్‌పై స్వప్న ఇంటికి వెళ్లాడు. ఇంటి తలుపులు బద్దలుకొట్టి లోపలికి ప్రవేశించాడు. అక్కడ నిద్రపోతున్న స్వప్న తల్లిదండ్రులను కత్తితో నరికేశాడు. అనంతరం స్వప్న అతని చెల్లి ఉపాసనపై దాడి చేసి పరారయ్యాడు.

Chrome Password Checker : మీ పాస్‌వ‌ర్డ్ హ్యాక‌ర్ల చేతుల్లో.. అయితే డౌటే.. ఇలా చెక్ చేసుకోండి!

ఈ దాడిలో తీవ్రగాయాలతో ముగ్గురూ స్పాట్ లోనే చనిపోయారు. ఉపాసన మాత్రం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ప్రస్తుతం ఆమె పరిస్థితి కూడా విషమంగా ఉంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న నిందితుడు కోసం తీవ్రంగా గాలిస్తున్నారు.