America: ప్రయాణిస్తున్న ట్రక్కుపై డాన్స్ చేస్తూ హంగామా.. బ్రిడ్జికి ఢీ-కొట్టుకుని మరణం

రెండవ బ్రిడ్జి వచ్చినప్పుడు బ్రిడ్జికి అతడు అభిముఖంగా ఉన్నాడు. వెనకాల నుంచి బ్రిడ్జి అంచు ఢీకొట్టింది. తీవ్ర గాయాలపాలైన అతడిని సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లినప్పటికీ లాభం లేకపోయింది. అప్పటికే అతడు చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. అతడు డ్యాన్స్ చేస్తూ మొదటి బ్రిడ్జిని తప్పించుకుని, రెండవ బ్రిడ్జి కాంక్రీటకు ఢీ కొట్టుకున్న వీడియోను నెట్టింట్లో షేర్ చేశారు

America: ప్రయాణిస్తున్న ట్రక్కుపై డాన్స్ చేస్తూ హంగామా.. బ్రిడ్జికి ఢీ-కొట్టుకుని మరణం

Man killed while dancing on top truck may have been filming himself

America: ఓ వ్యక్తి (25) ప్రయాణిస్తున్న ట్రక్కుపై డాన్స్ చేస్తూ బ్రిడ్జికి ఢీ-కొట్టుకుని చనిపోయాడు. అమెరికాలోని హోస్టన్ అనే ప్రాంతంలో మంగళవారం జరిగిందీ ఘటన. ఈ ఘటనను ఓ ప్రయాణికుడు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో ఇది వైరల్ అవుతోంది. హోస్టన్ పోలీస్ డిపార్ట్‭మెంట్ వెహికులర్ క్రైమ్స్ డివిజన్ తెలిపిన వివరాల ప్రకారం.. ఒక వ్యక్తి 18 చక్రాల ట్రక్కుపై ఎక్కి నృత్యం చేస్తున్నాడు. అయితే ఈ విషయం ట్రక్కు డ్రైవర్‭కు తెలియదు. ఇలా వెళ్తున్న క్రమంలో ఒక బ్రిడ్జి వచ్చింది. ముందుగా అది గమనించి తప్పించుకున్న ఆ వ్యక్తి, రెండవ బ్రిడ్జిని చూసుకోలేదు.

రెండవ బ్రిడ్జి వచ్చినప్పుడు బ్రిడ్జికి అతడు అభిముఖంగా ఉన్నాడు. వెనకాల నుంచి బ్రిడ్జి అంచు ఢీకొట్టింది. తీవ్ర గాయాలపాలైన అతడిని సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లినప్పటికీ లాభం లేకపోయింది. అప్పటికే అతడు చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. అతడు డ్యాన్స్ చేస్తూ మొదటి బ్రిడ్జిని తప్పించుకుని, రెండవ బ్రిడ్జి కాంక్రీటకు ఢీ కొట్టుకున్న వీడియోను నెట్టింట్లో షేర్ చేశారు. కాగా, ఈ కేసులో ట్రక్కు డ్రైవరును పోలీసులు విచారించారు. ట్రక్కుపై వ్యక్తి ఉన్న విషయం తనకు తెలియదని డ్రైవర్ చెప్పారు. దీంతో డ్రైవర్‮‭ను వదిలిపెట్టారు. అయితే ఈ వీడియో తానే తీయించుకుని ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ విషయమై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Jodo yatra : రాహుల్ గాంధీ చేపట్టి నడిచిన గాంధీ మనుమడు..జోడో యాత్రలో గాంధీ, నెహ్రూల మనిమనుమళ్లు నడవటం అద్భుతమంటున్న నేతలు