Extra Marital Affair Murder : వివాహేతర సంబంధం-హత్య చేసి, రోడ్డు ప్రమాదంగా చిత్రీకరణ

వివాహేతర  సంబంధానికి అడ్డుగా ఉన్నాడని స్నేహితుడిని హత్యచేసి... రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించాడో వ్యక్తి.  కేసు నమోదు చేసుకున్న పోలీసులు కొద్ది రోజుల్లోనే  కేసును చేధించి నిందుతుడిని

Extra Marital Affair Murder : వివాహేతర సంబంధం-హత్య చేసి, రోడ్డు ప్రమాదంగా చిత్రీకరణ

Extra Marital Affair Murder

Extra Marital Affair Murder :  వివాహేతర  సంబంధానికి అడ్డుగా ఉన్నాడని స్నేహితుడిని హత్యచేసి… రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించాడో వ్యక్తి.  కేసు నమోదు చేసుకున్న పోలీసులు కొద్ది రోజుల్లోనే  కేసును చేధించి నిందుతుడిని పట్టుకుని జైలుకు తరలించారు.

ప్రకాశం జిల్లా పుల్లల చెరువు మండలం ముటుకుల గ్రామంలో  గాడికొయ్య  పిచ్చయ్య (50) అనే వ్యక్తి గ్రామీణ ఉపాధి హామీ పధకం‌లో   ఫీల్డ్ అసిస్టెంట్‌గా పని చేస్తున్నాడు.  అతనికి అదే గ్రామానికి చెందిన రైతు, సిమెంట్ ఇటుకల వ్యాపారి..  చౌడబోయిన మల్లిఖార్జున రావు (39) స్నేహితుడు. మల్లికార్జునరావు, పిచ్చయ్యకు అవసరమైనప్పుడు ఆర్ధిక సహాయం చేస్తూ ఉండేవాడు.

ఈ పరిచయంతో  మల్లికార్జునరావు తరచుగా పిచ్చయ్య ఇంటికి వచ్చి వెళుతూ ఉండేవాడు. ఈ క్రమంలో పిచ్చయ్య   భార్య మల్లేశ్వరితో,  మల్లికార్జునరావుకు వివాహేతర సంబంధం ఏర్పడింది. కొన్నాళ్ళకు ఈవిషయం పిచ్చయ్యకు  తెలిసి పోయింది. దీంతో మల్లికార్జునరావును తన ఇంటికి రావద్దని, తన భార్యతో వివాహేతర  సంబంధాన్ని మానుకోమని పిచ్చయ్య హెచ్చరించాడు.

తమ  అక్రమ సంబంధం తెలిసిపోవటంతో మల్లికార్జునరావు జాగ్రత్త పడ్డాడు. కానీ పిచ్చయ్య భార్యను మర్చిపోలేకపోతున్నాడు.  ఆమెను కలవాలంటే  పిచ్చయ్య అడ్డుగా ఉన్నాడని, అతని అడ్డు తొలగించుకునేందుకు వేచి చూస్తున్నాడు.  మల్లికార్జునరావు  పిచ్చయ్య ఇంటికి  వెళ్లకపోయినా పిచ్చయ్యతో స్నేహం మాత్రం మానలేదు. అతడితో మాట్లాడుతూనే ఉన్నాడు.

నవంబర్ 6వ తేదీ సాయంత్రం  5గంటల సమయంలో పిచ్చయ్య మల్లికార్జునరావుకు చెందిన సిమెంట్ ఇటుకలు తయారు చేసే పరిశ్రమ వద్దకు వచ్చి  పుల్లలచెరువు పని ఉందని వెళ్లిపోయాడు.  అనంతరం రాత్రి సమయంలో మల్లికార్జునరావు, పిచ్చయ్యకు ఫోన్ చేసి  తినటానికి పుల్కాలు తెచ్చాను, తిందాం రమ్మని ఆహ్వానించాడు.

మల్లి కార్జునరావు కోరిక మేరకు పిచ్చయ్య మల్లికార్జునరావు పొలం వద్దకు వెళ్ళాడు. ఆ సమయంలో మల్లికార్జునరావు, మల్లేశ్వరితో ఫోన్ లో మాట్లాడుతున్నాడు.  పిచ్చయ్యకు అనుమానం వచ్చి, బైక్ పై మల్లికార్జునరావు వద్దనుంచి వెళ్లిపోయేందుకు ప్రయత్నించాడు.  అప్పుడు మల్లికార్జునరావు పిచ్చయ్యను ఆపి, పొలం దున్నేసి   వెళ్లి తిందాం ఆగమని కోరాడు. అయినా పిచ్చయ్యలో అనుమానం తీరలేదు. మల్లికార్జునరావు తన భార్యతో ఇంకా అక్రమ సంబంధం కొనసాగిస్తున్నాడనే అనుమానం పెరిగిపోయింది.

Also Read : Minor Girl Kidnap : మైనర్ బాలికను కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకున్న మైనర్ బాలుడు

ఇప్పుడు నీవు మాట్లాడిన ఫోన్ నెంబర్ చెప్పమని పిచ్చయ్య, మల్లికార్జునరావును అడిగాడు. అతను చెప్పకపోయే సరికి అనుమానం మరింత బలపడింది. ఇంటికి వెళ్లటానికి బయలుదేరబోయాడు. ఈవిషయంపై పిచ్చయ్య ఇంక గొడవ చేస్తాడని, మల్లేశ్వరి తనకు దూరం అయిపోతుందనుకున్న మల్లికార్జునరావు పిచ్చయ్యను చంపాలని నిర్ణయించుకున్నాడు.

వెంటనే అక్కడే ఉన్న ట్రాక్టర్ ఎక్కి,  బైక్ పై ఉన్న పిచ్చయ్య పైకి పోనిచ్చాడు. దీంతో పిచ్చయ్య బైక్ పై నుంచి కింద పడ్డాడు. అక్కడి నుంచి చేనులోకి పరిగెత్తగా మల్లికార్జునరావు ట్రాక్టర్ తో, చేనులో పిచ్చయ్యను వెంబడించి, ఢీ కొట్టాడు. కింద పడిపోయిన పిచ్చయ్య  పైనుంచి ట్రాక్టర్ ఎక్కించి హత్య చేశాడు. కసి తీరక పిచ్చయ్య గుండెలపై రాయితో కొట్టాడు.

Also Read :Temple Hundi : చెప్పులు విప్పి గుడిలో హుండీ చోరీ చేసిన దొంగ

పిచ్చయ్య చనిపోయాడని నిర్ధారించుకుని అతని బైక్ ను, శవాన్ని తీసుకు వచ్చి రోడ్డుమీద పడేసి రోడ్డు ప్రమాదంలాగా  చిత్రీకరించి  ట్రాక్టర్ వేసుకుని  తన ఇంటికి వెళ్లిపోయాడు.  మర్నాడు 7వ తేదీ ఉదయం పిచ్చయ్య శవాన్ని గుర్తించిన గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్ధలానికి వచ్చిన పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.

మృతుడి  సెల్‌ఫోన్ కాల్స్ ఆధారంగా విచారణ చేపట్టి, మల్లికార్జునరావును  అదుపులోకి తీసుకున్నారు. అతని ఫోన్ లో మృతుడు భార్య   మల్లేశ్వరితో   ఎక్కువ  కాల్స్ చేసి ఉండటం గమనించారు. నిందితుడిని తమదైన స్టైల్లో  విచారించే సరికి మల్లికార్జునరావు  నేరం ఒప్పుకున్నాడు. నిందితుడిపై ఐపీసీ సెక్షన్ 302,201 & Sec 3 (2) (v) SC,ST (POA) Act 1989 ల కింద కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు.