బ్లాక్ మెయిల్ చేసి ముగ్గురిపై అత్యాచారం – నిందితుడికి యావజ్జీవ శిక్ష

ముగ్గురు మహిళలను బ్లాక్ మెయిల్ చేసి లైంగిక దాడికి పాల్పడిన నిందితుడికి ఆదిలాబాద్ జిల్లా మహిళా జడ్జి, ఉమ్మడి 6వ కోర్టు జడ్జి వై.జయప్రసాద్ రూ.2.60 లక్షల జరిమానా, జీవిత ఖైదు విధించారు.

బ్లాక్ మెయిల్ చేసి ముగ్గురిపై అత్యాచారం – నిందితుడికి యావజ్జీవ శిక్ష

man molested 3 women, Adilabad judge lifetime ordered imprisonment : ముగ్గురు మహిళలను బ్లాక్ మెయిల్ చేసి లైంగిక దాడికి పాల్పడిన నిందితుడికి ఆదిలాబాద్ జిల్లా మహిళా జడ్జి, ఉమ్మడి 6వ కోర్టు జడ్జి వై.జయప్రసాద్ రూ.2.60 లక్షల జరిమానా, జీవిత ఖైదు విధించారు.

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లిలో 2017లో జరిగిన ఈ ఘటనలో న్యాయమూర్తి సోమవారం తీర్పు చెప్పారు. బెల్లంపల్లిలో ఓ ఇంట్లో పనిచేసే మహిళతో షేక్ అన్వర్ అనే వ్యక్తికి పరిచయం ఏర్పడింది. రోజు ఆమెను పలకరించటానికి వెళ్తూ ఉండేవాడు.

ఒకరోజు అన్వర్ వెళ్లే సమయానికి ఆ ఇంటి యజమానురాలు దుస్తులు మార్చుకుంటుండగా ఆమెను రహస్యంగా ఫోటోలు తీశాడు. అనంతరం ఆ ఫోటోలు ఆమెకు చూపించి ఆమెపై లైంగిక దాడికి యత్నించాడు. ఆమె ప్రతిఘటించటంతో ఆమె కొడుకును చంపేస్తానని బెదిరించటంతో ఆమె అతడిరకి భయపడిలొంగింది.

అనంతరం 9వ తరగతి చదువుతున్న ఆమె కుమార్తెకు ..తల్లి నగ్నఫోటోలు చూపించి సోషల్ మీడియాలో పెడతానని బెదిరించి బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. వీరిద్దరిపైనే కాకుండా తనకు పరిచయం ఉన్న ఆ ఇంట్లోని పనిమనిషిమీద కూడా అన్వర్ లైంగిక దాడికి పాల్పడేవాడు.

బాధితులంతా ఏకమై బెల్లంపల్లి పోలీసులకు ఫిర్యాదు చేయటంతో పోలీసులు 2017 లో కేసు నమోదు చేశారు. కేసు విచారణలో పబ్లిక్ ప్రాసిక్యూటర్ 16 మంది సాక్షులను కోర్టులో ప్రవేశ పెట్టటంతో నిందితుడి నేరం రుజువైంది. న్యాయమూర్తి నిందితుడికి జీవిత ఖైదుతోపాటు. రూ.2.60లక్షల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు.