నమస్తే పెట్టలేదని దారుణ హత్య, కత్తితో పొడిచి చంపేశారు

హైదరాబాద్ లో దారుణం జరిగింది. నమస్తే పెట్టకపోవడమే అతడి పాలిట శాపంగా మారింది. అతడి ప్రాణం పోవడానికి కారణమైంది. నమస్తే పెట్టలేదనే కోపంతో ఓ వ్యక్తిని కత్తితో పొడిచి చంపేశారు. రోషన్ కాలనీకి చెందిన షేక్ జావీద్(28) వంట మనిషిగా పని చేస్తుంటాడు. శుక్రవారం రాత్రి 12:30 గంటల సమయంలో అన్సారీ రోడ్డు ఓవైసీ హిల్స్ దగ్గర అతడు నిలబడి ఉన్నాడు. అదే సమయంలో అటుగా నలుగురు వ్యక్తులు వెళ్తున్నారు. వారిలోఒకరిని షేక్ జావీద్ గుర్తు పట్టి నమస్తే పెట్టాడు.
కాగా, ఆ నలుగురిలోని మరో వ్యక్తి జావీద్ దగ్గరికి వచ్చాడు. నాకు నమస్తే ఎందుకు పెట్టలేదని అతడితో గొడవకు దిగాడు. కోపంతో ఊగిపోయిన ఆ వ్యక్తి తన దగ్గరున్న కత్తితో జావీద్‌ను విచక్షణారహితంగా పొడిచాడు. తీవ్రగాయాలు కావడంతో జావీద్ అక్కడికక్కడే చనిపోయాడు. జావీద్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
షేక్ జావీద్‌ను హత్య చేసిన నలుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అజహార్, హన్నాన్, సయిద్, కమ్రాన్‌లు పోలీసులు అదుపులో ఉన్నట్లు తెలుస్తోంది. పోలీసులు మాత్రం తాము ఇంకా ఎవరినీ పట్టుకోలేదని అంటున్నారు. ఈ ఘటన స్థానికులను భయాందోళనకు గురి చేసింది. ఓ చిన్న కారణంతో నిండు ప్రాణాన్ని బలితీసుకోవడం ఆవేదనకు గురి చేసింది. నమస్తే పెట్టకపోతే కత్తులతో పొడిచి చంపేయం ఉలిక్కి పడేలా చేసింది.