Mahabubnagar Murder : కాపురానికి వెళ్లనన్న కూతురు.. కొట్టి చంపిన తండ్రి.. అడ్డువచ్చిన భార్యను కూడా..

కాపురానికి వెళ్లనన్న కూతురిని, ఆమెకు మద్దతు తెలిపిన తల్లిని దారుణంగా హత్య చేశాడు తండ్రి. అనంతరం తను కూడా ఆత్మహత్యాయత్నం చేశాడు.(Mahabubnagar Murder)

Mahabubnagar Murder : కాపురానికి వెళ్లనన్న కూతురు.. కొట్టి చంపిన తండ్రి.. అడ్డువచ్చిన భార్యను కూడా..

Mahabubnagar Murder

Mahabubnagar Murder : మహబూబ్ నగర్ లో దారుణం జరిగింది. కాపురానికి వెళ్లనన్న కూతురిని, ఆమెకు మద్దతు తెలిపిన తల్లిని దారుణంగా హత్య చేశాడు తండ్రి. అనంతరం తను కూడా ఆత్మహత్యాయత్నం చేశాడు. విషయం తెలుసుకున్న స్థానికులు ఆసుపత్రికి తరలిస్తుండగా తల్లి, కూతురు మార్గమధ్యంలోనే చనిపోయారు. తండ్రి పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతం మహబూబ్ నగర్ ఆసుపత్రిలో అతడు చికిత్స పొందుతున్నాడు.

Husband murder Wife: భార్యను హత మార్చిన ‘సాఫ్ట్‌వేర్’ భర్త: తిరుపతిలో దారుణ ఘటన

మహబూబ్ నగర్ శివారు ప్రాంతం జైనల్లీపూర్ గ్రామానికి చెందిన కృష్ణయ్య, కళమ్మ దంపతులు. వారి కూతురు సరస్వతి. ఆమెకు ఈ నెల 8న వివాహం చేశారు. మహబూబ్ నగర్ పట్టణానికి చెందిన వ్యక్తితో ఘనంగా పెళ్లి చేశారు. అయితే పెళ్లైన 10 రోజులకే నవవధువు సరస్వతి పుట్టింటికి వచ్చేసింది. తనకు పెళ్లి కొడుకు నచ్చలేదని, ఇక తాను అత్తారింటికి వెళ్లనని తల్లిదండ్రులతో తేల్చి చెప్పింది. తల్లి కళమ్మ కూడా కూతురికి అండగా నిలిచింది.(Mahabubnagar Murder)

TV Actress : టీవీ నటి ఆత్మహత్యాయత్నం.. నిమ్స్‌కి తరలించిన పోలీసులు..

అయితే, తండ్రి మాత్రం అందుకు ఒప్పుకోలేదు. కూతురు కాపురానికి వెళ్లాల్సిందేనని తండ్రి కృష్ణయ్య పట్టుబట్టాడు. అత్తారింటికి వెళ్లిపోవాలంటూ ఇవాళ ఉదయం కృష్ణయ్య.. తన కూతురు సరస్వతిని మందలించాడు. అయితే కాపురానికి వెళ్లేది లేదని సరస్వతి ఎదురు తిరిగింది. దీంతో కోపంతో ఊగిపోయిన కృష్ణయ్య.. రోకలిబండతో సరస్వతిపై దాడి చేశాడు. సరస్వతి నిర్ణయాన్ని సమర్థించిన తల్లి కళమ్మని కూడా రోకలిబండతో కొట్టాడు. అనంతరం తాను కూడా విషగుళికలు మింగేశాడు. తానే వారిద్దరిని కొట్టి విషగుళికలు మింగినట్లు బంధువులకు ఫోన్ చేసి చెప్పాడు. వెంటనే కృష్ణయ్య ఇంటికి వచ్చిన బంధువులు ముగ్గురిని ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం తల్లి, కూతురిని హైదరాబాద్ తరలిస్తుండగా.. మార్గమధ్యంలో మరణించారు.

Hyderabad : గచ్చిబౌలి యువతి రేప్ కేసులో కొత్త ట్విస్ట్

కూతురు కాపురానికి వెళ్లే విషయమై వారం రోజులుగా ఇంట్లో గొడవలు జరుగుతున్నాయని, ఈ కోవలోనే కోపోద్రిక్తుడైన కృష్ణయ్య రోకలిబండతో కూతురిని, ఆమె అండగా నిలిచిన భార్యను విచక్షణా రహితంగా కొట్టాడని స్థానికులు పోలీసులతో చెప్పారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదం నింపింది. కృష్ణయ్య కుటుంబసభ్యులు విషాదంలో మునిగిపోయారు.

Gachibowli Gang Rape Case : గచ్చిబౌలి యువతి గ్యాంగ్ రేప్ కేసులో ట్విస్టులు.. వెలుగులోకి గాయత్రి దురాగతాలు

ఇటీవలి కాలంలో తెలుగు రాష్ట్రాల్లో వరుస నవ వధువుల మరణాలు కలకలం రేపుతున్నాయి. ఇష్టం లేని పెళ్లి చేశారని ఒకరు, ప్రేమ పెళ్లి జరగలేదని మరొకరు ప్రాణాలు తీసుకుంటున్నారు. అంగరంగ వైభవంగా పెళ్లి జరిగిన గంటలు, రోజుల వ్యవధిలోనే పెళ్లి కూతురి మరణం.. ఆ పెళ్లింట తీవ్ర విషాదాన్ని నింపుతోంది. కాళ్ల పారాణి ఆరకముందే నవవధువు అనంత లోకాలకు చేరిపోవటం కలచివేస్తోంది. కారణం ఏదైనా, కారణం ఎవరైనా.. నవ వధువుల జీవితాలు అర్థాంతరంగా ముగిసిపోవడం బాధాకరం.

Massage Centers : మసాజ్ సెంటర్ల మాఫియాకు యువకుడు బలి