Rape Attempt : యువతిపై అత్యాచారం-కాపాడిన హిజ్రాలు

ఇంట్లో ఒంటరిగా ఉన్న యువతిపై అత్యాచారం చేయబోతున్న యువకుడిని అడ్డగించి, ఆ యువతిని కాపాడారు ఇద్దరు హిజ్రాలు.

Rape Attempt : యువతిపై అత్యాచారం-కాపాడిన హిజ్రాలు

Rape Attempt

Rape Attempt  :  ఇంట్లో ఒంటరిగా ఉన్న యువతిపై అత్యాచారం చేయబోతున్న యువకుడిని అడ్డగించి, ఆ యువతిని కాపాడారు ఇద్దరు హిజ్రాలు. బెంగుళూరులోని కేఆర్ పురంలోని వివేక్ నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో కోరమంగళం వద్ద ఉన్న ఈజిపురలో మిజోరాం కు చెందిన ఒక యువతి నర్సింగ్ కోర్సు చేస్తూ నివసిస్తోంది.

అదే ప్రాంతంలో నివసిస్తున్న పశ్చిమ బెంగాల్ కు చెందిన మసురుల్ షేక్ అనే యువకుడు యువతిపై కన్నేశాడు.  ఒక హోటల్ లో పని చేసే మసురుల్ షేక్  రోజు ఆమెను ఏడిపించడానికి ఆమె ఉంటున్న ఇంటి కాలింగ్ బెల్ నొక్కి పారిపోయేవాడు. తలుపు  తీసుకుని చూస్తే ఎవరూ కనపడకపోయే సరికి ఆ యువతి మళ్లీ తలుపు వేసుకుని లోపలకు వెళ్లిపోయేది.

ఈనెల 2వ తేదీ తెల్లవారుజాము కూడా అదే మాదిరిగా కాలింగ్ బెల్ నొక్కాడు. ఆమె డోర్ తీయగానే ఆమెను నెట్టుకుంటూ లోపలకు వెళ్లి ఆమెపై అత్యాచారం చేయబోయాడు.  భయంతో ఆమె కేకలు వేసింది. ఆమె కేకలు విని అక్కడకు దగ్గరలోనే ఉన్న ఇద్దరు  హిజ్రాలు వచ్చి యువతిని రక్షించి… ఆ యువకుడిని పట్టుకున్నారు. స్ధానికులు వచ్చి యువకుడికి దేహశుధ్ది చేసి  పోలీసులకు అప్పగించారు.