నోరుమూసి.. నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారం : 10 రోజుల వ్యవధిలో మూడో దారుణం

తెలంగాణలో దిశ నిందితులను ఎన్‌కౌంటర్ చేసినా.. ఏపీలో దిశ వంటి కఠిన చట్టాలు వచ్చినా.. మృగాళ్లలో మార్పు రావడం లేదు. దేశంలో నిత్యం ఏదో ఒక చోట అత్యాచార ఘటనలు

  • Published By: veegamteam ,Published On : December 19, 2019 / 03:52 PM IST
నోరుమూసి.. నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారం : 10 రోజుల వ్యవధిలో మూడో దారుణం

తెలంగాణలో దిశ నిందితులను ఎన్‌కౌంటర్ చేసినా.. ఏపీలో దిశ వంటి కఠిన చట్టాలు వచ్చినా.. మృగాళ్లలో మార్పు రావడం లేదు. దేశంలో నిత్యం ఏదో ఒక చోట అత్యాచార ఘటనలు

తెలంగాణలో దిశ నిందితులను ఎన్‌కౌంటర్ చేసినా.. ఏపీలో దిశ వంటి కఠిన చట్టాలు వచ్చినా.. మృగాళ్లలో మార్పు రావడం లేదు. దేశంలో నిత్యం ఏదో ఒక చోట అత్యాచార ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. మృగాళ్లు పసిపిల్లలను కూడా వదలడం లేదు. తాజాగా గుంటూరు జిల్లా మరో దారుణం చోటుచేసుకుంది. కొత్త పీఎస్ పరిధిలో నాలుగేళ్ల నేపాల్ బాలికపై అత్యాచారం జరిగింది.

అభంశుభం తెలియని పసిపాపపై 40 ఏళ్ల వ్యక్తి అఘాయిత్యానికి ఒడిగట్టాడు. చిన్నారిని కొట్టి.. నోరుమూసి.. అత్యాచారం చేశాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. బాలిక శరీరంపై గాయాలు కనిపించడంతో తల్లిదండ్రులకు అనుమానం కలిగింది. ఏం జరిగిందోనని ఆరా తీశారు. దీంతో అసలు విషయం వెలుగు చూసింది. బాలిక కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుడు వేణుగోపాల్‌ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేశారు.

ఏపీలో దిశ లాంటి కఠిన చట్టం తీసుకొచ్చినా ఇలాంటి దారుణాలు పునరావృతమవుతూనే ఉన్నాయి. గత 10 రోజుల వ్యవధిలో ఇది మూడో అత్యాచార ఘటన. వరుస ఘోరాలతో మహిళలు, అమ్మాయిలు, చిన్నపిల్లల భద్రతపై ఆందోళన నెలకొంది. ఇటీవలే గుంటూరులో ఐదేళ్ల బాలికపై అత్యాచారం జరిగింది. ఆ షాక్ నుంచి ఇంకా తేరుకోలేదు. అప్పుడే మరో దారుణం జరిగడం కలవరానికి గురి చేసింది. కామాంధులను కఠినంగా శిక్షించేందుకు తెచ్చిన దిశ బిల్లును అసెంబ్లీ ఆమోదించిన రోజే గుంటూరులో ఈ ఘటన వెలుగు చూసింది. చట్టాలు కాగితాలకే పరిమితమయ్యాయని అందుకు ఇలాంటి ఘోరాలు జరుగుతున్నాయని మహిళా సంఘాలు ఆరోపించాయి. అఘాయిత్యాలకు పాల్పడే వారిని వెంటనే కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.