గన్‌తో చెవిలో కాల్చుకుంటే బయటకు వచ్చి గర్భిణీకి తగిలిన బుల్లెట్ 

  • Published By: Subhan ,Published On : May 24, 2020 / 08:44 AM IST
గన్‌తో చెవిలో కాల్చుకుంటే బయటకు వచ్చి గర్భిణీకి తగిలిన బుల్లెట్ 

ఓ వింత ఘటనలో వ్యక్తి తనకు తానే చెవిలో గన్‌తో కాల్చుకున్నాడు. తలలో నుంచి బయటకు వచ్చిన బుల్లెట్ అటువైపున కూర్చొని ఉన్న గర్భిణీగా ఉన్న భార్యకు తగిలింది. కారులో ఉన్న సమయంలో ఈ ఘటన జరగడంతో మహిళ గొంతులోకి బుల్లెట్ దూసుకెళ్లింది. ఐసీయూలో ఉన్న వ్యక్తి ప్రాణాల కోసం పోరాడుతున్నాడు. ఏడు నెలల గర్భిణీ ప్రమాదం నుంచి బయటపడినట్లు వైద్యులు చెప్పారు. 

నిరుద్యోగం గురించి వారిద్దరి మధ్య వాదన మొదలైంది. అది పెరిగిపోవడంతో షూట్ చేసుకున్నాడని భార్య స్టేట్‌మెంట్ ఇచ్చింది. డిప్యూటీ పోలీస్ కమిషనర్(మానేసర్) దీపక్ సహరన్ బుల్లెట్ మనిషి తలలో నుంచి బయటివైపుకు వచ్చేశాయి. బాల్లిస్టిక్స్ రిపోర్టులు ఇంకా రావాల్సి ఉన్నాయి. దీనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారణ చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. 

ఓ మనిషిలో నుంచి బుల్లెట్ బయటకు వచ్చి మరో వ్యక్తికి తగలడం అనేది చాలా రేర్ కేసుల్లో మాత్రమే జరుగుతాయి. బాధితులు చాలా దగ్గరిగా ఉంటేనే ఇలా జరిగే అవకాశాలు ఉన్నాయని ఓ సీనియర్ పోలీస్ ఆఫీసర్ అంటున్నారు. ఆ వ్యక్తికి కొద్ది నెలలుగా ఉద్యోగం లేకుండా బాధపడుతున్నాడు. క్రిటికల్ గా, మత్తులో అతను ట్రీట్ మెంట్ తీసుకుంటున్నాడు. అతని భార్య ప్రమాదం నుంచి బయటపడి ఢిల్లీలోని సఫ్దార్జంగ్ హాస్పిటల్లో ఉంది. 

గర్భిణీ అయిన భార్యను చెకప్ కోసం తీసుకెళ్తుండగా అతను ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఫరీదాబాద్ లో ఉంటున్న జంట గురుగ్రామ్ లో ఉన్న రాంపుర ఏరియాలోని అద్దె ఇంటికి మారారు. ఆ వ్యక్తి తన తొలి భార్య నుంచి 2017లో విడిపోయాడు. మధురలో కిరాణా షాపు నడుపుతున్నాడు. 2019లో అతనికి రెండో వివాహమైంది. పోలీసు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. 

వారిద్దరి మధ్య వాదన పెరిగింది. దీంతో ఆ వ్యక్తి మహిళను చెకప్ అనంతరం పుట్టింట్లో దించడానికి బయల్దేరాడు. ఆమె అతనితో పాటే ఉంటానని వాదించింది. గొడవ పెద్దది కావడంతో  SUV కారు పార్కింగ్ చేసి పిస్టల్ తో కాల్చుకున్నాడని ఆఫీసర్ చెప్పుకొచ్చాడు. ఆమె ఇచ్చిన స్టేట్‌మెంట్‌లో వారిద్దరూ 4రోజులుగా ఉద్యోగం లేదని గొడవపడుతున్నట్లు చెప్పింది. 7.62 మిల్లీమీటర్ల కార్ట్‌రిడ్జ్ ను పిస్టల్ లో వాడారు. 

పోలీసులు ఆ తుపాకీకి లైసెన్స్ ఉందా అని చెక్ చేస్తున్నారు. రోడ్డుపై వెళ్తున్న వ్యక్తి కారులో ఉన్న వ్యక్తులకు రక్తస్రావం అవుతున్నట్లు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. గురుగ్రామ్స్ సివిల్ హాస్పిటల్ కు ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఆ తర్వాత ఢిల్లీలోని సఫ్దార్జంగ్ హాస్పిటల్ కు రిఫర్ చేశారు. 

మహిళ స్టేట్‌మెంట్ ప్రకారం.. ఐపీసీ సెక్షన్ 309 (ఆత్మహత్యాయత్నం) కింద కేసులు నమోదు చేశారు.