Rajasthan: రాజస్థాన్‌లో కాల్పులు.. ఒకరి మృతి.. 48 గంటలపాటు ఇంటర్నెట్ బంద్

రాజస్థాన్, బిల్వారాలో దుండగులు కాల్పులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో ఒక వ్యక్తి మరణించాడు. మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ హత్య నేపథ్యంలో ఉద్రిక్తత తలెత్తకుండా అధికారులు చర్యలు చేపట్టారు.

Rajasthan: రాజస్థాన్‌లో కాల్పులు.. ఒకరి మృతి.. 48 గంటలపాటు ఇంటర్నెట్ బంద్

Rajasthan: రాజస్థాన్‌లో కాల్పుల అంశం ఉద్రిక్తతకు దారి తీసింది. రాజస్థాన్ బిల్వారాలో ఇద్దరు ముస్లిం సోదరులపై గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపారు. బైకుపై వచ్చిన నలుగురు వ్యక్తులు.. ఇద్దరిపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఇద్దరికీ బుల్లెట్ గాయాలయ్యాయి.

Arvind Kejriwal: కేజ్రీవాల్‌ను చంపేందుకు బీజేపీ కుట్ర.. మనీష్ సిసోడియా ఆరోపణ

వెంటనే వారిని కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో చేర్చారు. అయితే, వారిలో ఒకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. దీంతో అతడి కుటుంబ సభ్యులు ఆస్పత్రిని ధ్వంసం చేశారు. గాయాలపాలైన మరో వ్యక్తిని ఉదయ్‌పూర్ ఆస్పత్రికి తరలించారు. కాగా, గతంలో ఆదర్శ తపాడియా అనే వ్యక్తి హత్యకు ప్రతీకారంగానే ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది. మరణించిన వ్యక్తి ముస్లిం వ్యక్తి కావడం, అతడి బంధువులు, సన్నిహితులు ఆస్పత్రి ధ్వసం చేయడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇది ఇరువర్గాల మధ్య ఘర్షణకు దారి తీసే అవకాశం ఉంది. దీంతో ఈ ఉద్రిక్తతలు ఇంకా పెరగకుండా రాజస్థాన్ పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. బిల్వారా పరిధిలో 48 గంటలపాటు ఇంటర్నెట్ నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు.

ఈ ఏడాది మేలో తపాడియాను కొందరు వ్యక్తులు హత్య చేశారు. ఇరు వర్గాల మధ్య ఉన్న వైరం కారణంగా ఈ హత్య జరిగింది. అప్పట్లో పరిస్థితులు ఆందోళనకరంగా మారాయి. మళ్లీ ఇప్పుడు అలాంటి పరిస్థితులు తలెత్తకుండా పోలీసులు జాగ్రత్తవహిస్తున్నారు. బిల్వారా పరిధిలోని అన్ని ప్రాంతాల్లో పోలీసుల్ని మోహరించారు. నిందితుల కోసం గాలిస్తున్నారు.