Molestation : వివాహిత స్నానం చేస్తుండగా వీడియో తీసి బ్లాక్‌మెయిల్

వివాహిత స్నానం చేస్తుండగా సెల్ ఫోన్ తో వీడియో తీసి ఆ వీడియో చూపించి బ్లాక్ మెయిల్ చేస్తూ, లైంగిక దాడి చేస్తున్న ఇద్దరు అన్నదమ్ములను ఖమ్మం పొలీసులు అరెస్ట్ చేశారు.

Molestation : వివాహిత స్నానం చేస్తుండగా వీడియో తీసి బ్లాక్‌మెయిల్

Khammam Molestation

Molestation : వివాహిత స్నానం చేస్తుండగా సెల్ ఫోన్ తో వీడియో తీసి ఆ వీడియో చూపించి బ్లాక్ మెయిల్ చేస్తూ, లైంగిక దాడి చేస్తున్న ఇద్దరు అన్నదమ్ములను ఖమ్మం పొలీసులు అరెస్ట్ చేశారు.

ఖానాపురం పోలీసు స్టేషన్ పరిధిలో నివసించే ప్రవీణ్ రాజ్ అనే యువకుడు తన పక్కింట్లో నివసించే వివాహిత స్నానం చేస్తుండగా సెల్ ఫోన్ తో వీడియోలు, ఫోటోలు తీశాడు, వాటిని ఆమెకు చూపించి బ్లాక్ మెయిల్ చేసి లొంగదీసుకున్నాడు. అప్పటి నుంచి ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఇదే అవకాశంగా తీసుకుని అతని సోదరుడు గిరిధర్ కూడా బ్లాక్ మెయిల్ కు పాల్పడటం మొదలెట్టాడు.

అన్నదమ్ములిద్దరూ ఆమెపై లైంగిక దాడి చేయటం మొదలెట్టారు. ఆ మహిళను మానసికంగా ఇబ్బంది పెట్టారు. దీంతో తనపై లైంగిక దాడి చేశారని,వేధింపులకు పాల్పడుతూ కులంపేరుతో దూషించారని ఆరోపిస్తూ బాధితురాలు పోలీసులకు ఫిర్యాదుచేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.