ఫిజికల్ రిలేషన్‌కి రెడీ అంటేనే సినిమాలో ఆఫర్: ఫ్యాషన్ డిజైనర్ కట్టుకథ

ఫిజికల్ రిలేషన్‌కి రెడీ అంటేనే సినిమాలో ఆఫర్: ఫ్యాషన్ డిజైనర్ కట్టుకథ

సినిమా ఆఫర్ ఇస్తా అన్నాడు. ప్లాన్ వేసి బోల్తా కొట్టడంతో బ్లాక్ మెయిల్ కు దిగాడు. ఓ మోడల్ ను మార్ఫింగ్ ఫొటోలతో బెదిరిస్తూ ఫిజికల్ రిలేషన్ లో ఉండాలని బెదిరించాడు. పూణెలో ఉండే 42ఏళ్ల ఫ్యాషన్ డిజైనర్ బాగోతం ఇది. కేరళకు చెందిన రాహుల్ శ్రీవాస్తవ ఆల్-ఇండియా వాట్సప్ ఫ్యాషన్ ఇండస్ట్రీ గ్రూప్ లో మెంబర్ గా ఉన్నాడు. అదే గ్రూపులో మెంబర్ అయిన ఓ యువతితో పరిచయం ఏర్పడింది.



తాను ఓ సినిమాకు డైరక్ట్ చేయబోతున్నానని నమ్మించి సాలుంకే విహార్ ప్రాంతంలో ఉన్న హోటల్ కు రమ్మని పిలిచాడు. అక్కడ సమీర్ అనే వ్యక్తిని పరిచయం చేశాడు. కొద్ది రోజుల తర్వాత సమీర్ యువతి పనికి ఇంప్రెస్ అయ్యాడని నమ్మబలికాడు. స్క్రీన్ టెస్టుకు రమ్మన్నాడని.. అగ్రిమెంట్ లో సంతకం పెట్టాలంటే ముంబైకి వచ్చి ఇది తప్పకుండా అటెంట్ అవ్వాలని చెప్పాడు.

ఆ మహిళ తాను ముంబైకి రాలేనని చెప్పడంతో వీడియో కాల్ చేసింది. నిందితుడు ఆ వీడియో స్క్రీన్ షాట్లు తీసి ఫొటోలను మార్ఫింగ్ చేశాడు. వాటిని ఆ మహిళకు పంపి తనతో ఫిజికల్ రిలేషన్ పెట్టుకోకపోతే వాటిని సర్కులేట్ చేస్తానంటూ బెదిరించి డిమాండ్ పట్టించుకోకపోవడంతో ఆల్రెడీ ఒక ఇమేజ్ ను వాట్సప్ గ్రూప్ లో షేర్ చేశాడు.



అతని చేష్టలకు విసుగువచ్చిన మహిళ కాంటాక్ట్ నెంబర్ ను బ్లాక్ లిస్టులో పెట్టేసి గ్రూపు నుంచి బయటకు వచ్చేసింది. అయినప్పటికీ పలు నెంబర్ల ద్వారా ఆమెకు ఇమేజ్ లు, వీడియోలు పంపడం మొదలుపెట్టాడు. దాంతో పోలీసులను ఆశ్రయించి సహాయం కోరింది. పోలీసులు శ్రీవాస్తవపై ఐటీ యాక్ట్, సెక్షన్లు 354, 354(ఏ), 354(డీ), 509 కింద కేసులు బుక్ చేశారు.