1400మంది మహిళలను అసభ్యంగా వీడియో తీసిన వ్యక్తి అరెస్ట్, రెండేళ్లు జైలు

రహస్య కెమెరాలతో మహిళలు, అమ్మాయిలను అసభ్యంగా వీడియోలు తీసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల విచారణలో విస్తుపోయే నిజాలు

  • Published By: naveen ,Published On : June 7, 2020 / 06:54 AM IST
1400మంది మహిళలను అసభ్యంగా వీడియో తీసిన వ్యక్తి అరెస్ట్, రెండేళ్లు జైలు

రహస్య కెమెరాలతో మహిళలు, అమ్మాయిలను అసభ్యంగా వీడియోలు తీసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల విచారణలో విస్తుపోయే నిజాలు

రహస్య కెమెరాలతో మహిళలు, అమ్మాయిలను అసభ్యంగా వీడియోలు తీసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల విచారణలో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. ఆ వ్యక్తి ఏకంగా 1400 మంది మహిళలు, పిల్లల వీడియోలు, ఫొటోలు రహస్యంగా తీశాడు. ఇందుకోసం స్పై వాచ్‌లు, స్పై కెమెరాలు, పెన్ కెమెరాలు, మొబైల్స్ వాడినట్లు పోలీసులు గుర్తించారు. ఇళ్లలోనే కాదు ఆఖరికి బస్సులు, ట్రైన్లలో వెళ్తున్న సమయంలోనూ మహిళల అసభ్య ఫొటోలు తీశాడని పోలీసులు చెబుతున్నారు. అన్నింటికి మించి ఈ సైకో మెయిన్ టార్గెట్ బాత్రూమ్ లే. వీడు తీసిన వాటిలో ఎక్కువగా స్నానాల గదిలో మహిళలు, చిన్న పిల్లలు ఉన్న వీడియోలే ఉన్నాయట. ఈ దారుణ ఘటన సింగపూర్ లో జరిగింది.

మహిళలవే కాదు ఆడపిల్లలవి కూడా:
అతడు వివాహితుడు. వయసు 35 ఏళ్లు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 13ఏళ్లుగా అదే పాడు పని. మహిళలు, పిల్లల అసభ్య వీడియోలు, ఫొటోలు తియ్యడం. చివరికి వాడి పాపం పండింది. పోలీసులకు చిక్కాడు. అతడిపై కేసు నమోదు చేసిన పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత కోర్టులో హాజరుపరిచారు. నిందితుడికి రెండేళ్ల 3 నెలల జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పిచ్చింది. 

కుటుంబసభ్యులు, స్నేహితులను కూడా వదల్లేదు:
వాడు ఎంత నీచుడంటే ఆఖరికి కుటుంబసభ్యులను కూడా వదల్లేదు. ఇంట్లో ఆడవాళ్లు, పిల్లలు బాత్ రూమ్ లో స్నానం చేస్తున్న సమయంలో రహస్యంగా వీడియోలు తీశాడు. ఇక స్నేహితులు, సహచర చర్చి మెంబర్ల వీడియోలు కూడా తీశాడు. జనవరి 2003 నుంచి 2016 ఏప్రిల్ వరకు ఇదే పని. మహిళలు, పిల్లలు బాత్రూమ్ లో, వాష్ రూమ్ లో, డ్రెస్ మార్చుకుంటున్న సమయంలో వీడియోలు, ఫొటోలు తీశాడు. పోలీసులు ఆ వ్యక్తి నుంచి 5  స్పై వాచ్ లు, 2 స్పై పెన్నులు, ఒక స్పై క్లాక్ స్వాధీనం చేసుకున్నారు. రిటైల్ షాపుల్లోనూ ఇలానే వీడియోలు, ఫొటోలు తీశాడు. 

చర్చి, బస్సులు, రైళ్లు, షాపుల్లో అసభ్య వీడియోలు, ఫొటోలు చిత్రీకరణ: 
సొంత ఇంట్లో ఉండే కుటుంబసభ్యులు, బంధువులను కూడా ఈ నీచుడు వదల్లేదు. బాత్ రూమ్ లో ఉన్న సమయంలో వారి వీడియోలు తీశాడు. ప్రార్థనల కోసం చర్చికి వెళ్లిన సమయంలో మహిళల టాయ్ లెట్ లోకి దూరి అక్కడ రహస్య కెమెరా అమర్చాడు. 2016 ఏప్రిల్ లో మహిళా కొలిగ్ ఆ వ్యక్తిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. బాత్ రూమ్ లో డ్రెస్ మార్చుకుంటూ ఉండగా తనపై కెమెరా ఫోకస్ పడటంతో ఆమె షాక్ తింది. వెంటనే బయటకు వచ్చి చూసింది. ఆ వ్యక్తిని పట్టుకోవాలని చూడగా అతడు చిక్కకుండా పారిపోయాడు. కిటికీలో నుంచి చూడగా ఆ వ్యక్తి తన కొలీగ్ అని గుర్తించింది. ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆ నీచుడి బండారం బట్టబయలైంది. ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. కాగా, పోలీసులు అతడిని వైద్యుల దగ్గరికి తీసుకెళ్లారు. అతడి మానసిక స్థితి గురించి ఆరా తీస్తున్నారు. ఏదైనా మానసిక జబ్బుతో బాధపడుతున్నాడా అని తెలుసుకునే పనిలో ఉన్నారు.