షాకింగ్: ట్రైన్ ఇంజిన్‌లో తెగిన తల.. మొండెం మిస్సింగ్!

రోడ్డుప్రమాదాల్లో వాహనాల ఇంజిన్స్ కింద ఇరుక్కున్న మృతదేహాలు ఆ వాహనాలతోపాటే కొన్ని వందల మైళ్లు ప్రయాణించిన ఘటనలు ఎన్నో విన్నాం. చదివాం. అలాంటి షాకింగ్ ఘటనే ఒకటి బెంగళూరులో కలకలం సృష్టించింది.

  • Published By: sreehari ,Published On : January 29, 2019 / 12:38 PM IST
షాకింగ్: ట్రైన్ ఇంజిన్‌లో తెగిన తల.. మొండెం మిస్సింగ్!

రోడ్డుప్రమాదాల్లో వాహనాల ఇంజిన్స్ కింద ఇరుక్కున్న మృతదేహాలు ఆ వాహనాలతోపాటే కొన్ని వందల మైళ్లు ప్రయాణించిన ఘటనలు ఎన్నో విన్నాం. చదివాం. అలాంటి షాకింగ్ ఘటనే ఒకటి బెంగళూరులో కలకలం సృష్టించింది.

రోడ్డుప్రమాదాల్లో వాహనాల ఇంజిన్స్ కింద ఇరుక్కున్న మృతదేహాలు ఆ వాహనాలతోపాటే కొన్ని వందల మైళ్లు ప్రయాణించిన ఘటనలు ఎన్నో విన్నాం. చదివాం. అలాంటి షాకింగ్ ఘటనే ఒకటి బెంగళూరులో కలకలం సృష్టించింది. అప్పుడు బస్సులు, లారీలు, కార్ల వంటి వాహనాల్లో మొండాలు, కాళ్లు చేతులు ప్రయాణించిన ఘటనలు వెలుగులోకి వస్తే.. ఈసారి ఏకంగా ట్రైన్ ఇంజిన్ లోనే ఓ వ్యక్తి తల వందల కిలోమీటర్లు ప్రయాణించింది. దాదాపు 3 గంటల పాటు 110 కిలోమీటర్లు వరకు ప్రయాణించింది.

కర్నాటకలోని బిరూర్ జంక్షన్ దగ్గర రైల్వే అధికారులు చెక్ చేయడంతో రైలు ఇంజిన్ లో తెగిన మనిషి తల ప్రత్యక్షమైంది. అసలు ఈ తల ఎక్కడి నుంచి వచ్చింది. మరి.. మొండెం ఎక్కడ ఉందనే కోణంలో రైల్వే పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఎవరో వ్యక్తి ట్రైన్ ముందు నుంచి జంప్ చేసి సూసైడ్ చేసుకున్నట్టుగా అనుమానిస్తున్నారు.

ఎలా గుర్తించారంటే..
రానెబెన్నూర్ నుంచి బీరూర్ కు మధ్య ఫ్యాసింజర్ రైలు ప్రయాణిస్తోంది. రైలు 110 కిలోమీటర్ల దూరం ప్రయాణించాలి. అంటే.. దాదాపు 3 గంటల సమయం పడుతుంది. ఈ క్రమంలో కొంతదూరం వెళ్లాక ఒక్కసారిగా ట్రైన్ ఇంజిన్ లో ఏదో సమస్య ఉన్నట్టు లోకో పైలట్ గుర్తించాడు. వెంటనే.. ఆ విషయాన్ని రైల్వే సిబ్బందికి సమాచారం అందించాడు. ట్రైన్ ఇంజిన్ లో ఏదో సమస్య ఉంది.. ట్రైన్ వీల్స్ దగ్గర ఏదో శబ్దం వస్తుందని చెప్పాడు. అప్రమత్తమైన రైల్వే అధికారులు టీఎస్నాయక్ ఆధ్వర్యంలో చెక్ చేయగా.. ట్రైన్ ఇంజిన్ లో తెగిన మనిషి తల ఉండటం చూసి షాకయ్యారు.

ట్రైన్ ఇంజిన్ లో ఇరుక్కున్న మనిషి తలను బీరూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. రైల్వే కంట్రోల్ రూంలోని పోలీసు స్టేషన్లకు సమాచారం అందించారు. రెనెబెన్నూర్ రైల్వే స్టేషన్ వద్ద ఓ వ్యక్తి మొండెన్ని గుర్తించినట్టు సమాచారం వచ్చింది. రైల్వే పోలీసులు తెగిన తల, మొండెం ఫొటోలను షేర్ చేశారు. చివరికి మృతుడు కుమార్ పరషప్ప తల్వార్ (31) గా పోలీసులు గుర్తించారు.

అనంతరం మృతుడి కుటుంబ సభ్యులకు అతడి తెగిన తలను అప్పగించినట్టు రైల్వే పోలీసు తెలిపారు. ముందుగా మృతుడి మొండెం మాత్రమే దొరకడంతో కుటుంబ సభ్యులు అతడి మృతదేహాన్ని ఖననం చేశారు. చివరికి తల్వార్ తల కూడా దొరకడంతో దాన్ని కూడా ఖననం చేసినట్టు రైల్వే అధికారి ఒకరు చెప్పారు.