Ganja Smuggling : పుష్ప తరహాలో స్మగ్లింగ్-స్కార్పియోతో నదిలోకి దూకిన గంజాయి స్మగ్లర్లు

తెలుగు రాష్ట్రాల్లో స్మగ్లర్లు రూట్ మార్చారు. పోలీసులకు పట్టుబడకుండా దందా చేసేందుకు కొత్త మార్గాలు వెతుకుతున్నారు. ఈ మధ్య పుష్ప సినిమా వచ్చాక ఇలాంటి స్మగ్లింగ్స్‌ ఎక్కువయ్యాయి.

Ganja Smuggling : పుష్ప తరహాలో స్మగ్లింగ్-స్కార్పియోతో నదిలోకి దూకిన గంజాయి స్మగ్లర్లు

Alluri District Ganjai Smuggling

Ganja Smuggling :  తెలుగు రాష్ట్రాల్లో స్మగ్లర్లు రూట్ మార్చారు. పోలీసులకు పట్టుబడకుండా దందా చేసేందుకు కొత్త మార్గాలు వెతుకుతున్నారు. ఈ మధ్య పుష్ప సినిమా వచ్చాక ఇలాంటి స్మగ్లింగ్స్‌ ఎక్కువయ్యాయి. పోలీసులకు దొరకకుండా పుష్ప సినిమాలో హీరో ఎర్రచందనం దుంగలను రిజర్వాయర్‌లో పడేస్తాడు. అల్లూరి జిల్లాలోనూ ఇదే తరహా సీన్ రిపీట్‌ అయింది. కాకపోతే సినిమాలో ఎర్రచందనాన్ని స్మగ్లింగ్‌ చేస్తే.. అల్లూరి జిల్లాలో గంజాయి తరలిస్తోన్న వాహనంతో సహా ప్రాజెక్టులోకి దూసుకెళ్లారు స్మగ్లర్లు.

స్కర్పియో వాహనంలో విశాఖ నుంచి మారేడుమిల్లి వైపు గంజాయిని తరలిస్తోన్నట్టు పోలీసులకు సమాచారం అందింది. దీంతో మారేడుమిల్లి పోలీసులు స్కార్పియోను వెంబడించారు. పోలీసులు వెంటబడ్డ విషయాన్ని గమనించి గంజాయి స్మగ్లర్లు స్కార్పియోలో వేగంగా దూసుకెళ్లారు. పోలీసులు కూడా అంతే వేగంతో ఛేజింగ్ చేస్తుండటంతో ఇక దొరికిపోక తప్పదని గంజాయి స్మగ్లర్లు గ్రహించారు.

రంపచోడవరం డివిజన్‌ భూపతిపాలెం ప్రాజెక్ట్‌ దగ్గరికి రాగానే స్కార్పియోతో సహా ప్రాజెక్టులోకి దూసుకెళ్లారు. స్కార్పియో నీళ్లలో పడేలోపు స్మగ్లర్లంతా నీళ్లలో దూకారు. పోలీసులు వెంటనే గజ ఈతగాళ్లను రంగంలోకి దింపారు. ప్రాజెక్టు నలువైపులా పోలీసులు చుట్టుముట్టారు. ఒక గంజాయి స్మగ్లర్‌ను అరెస్ట్ చేశారు. మరొక స్మగ్లర్‌ పోలీసుల వచ్చేలోగానే పారిపోయాడు. పారిపోయిన నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. అటు నీళ్లలో పడ్డ స్కార్పియో నుంచి 400 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
Also Read : Digital Rape : 17 ఏళ్ల బాలికను డిజిటల్ రేప్ చేసిన 81 ఏళ్ల వృధ్దుడు అరెస్ట్