Updated On - 11:45 am, Fri, 26 February 21
Bride kidnap : వివాహ ఏర్పాట్లన్నీ ఘనంగా చేశారు.. మరికొన్ని గంటల్లో పెళ్లి.. ఇంతలోనే పెళ్లి కుమార్తె కిడ్నాప్ కలకలం రేపింది. పోలీసుల కథనం ప్రకారం.. రొద్దం మండలం గౌరాజుపల్లికి చెందిన యువతికి పెళ్లి నిశ్చయమైంది. గురువారం పెళ్లి పీటలు ఎక్కాల్సి ఉండగా… మేకప్‌కు అవసరమైన సామగ్రి కొనుగోలు చేసేందుకు బుధవారం పెళ్లికుమార్తె మండల కేంద్రానికి వెళ్లింది.
అప్పటికే మాటు వేసి ఉన్న ఆమె బావ.. మరో ఇద్దరితో కలిసి యువతిని బలవంతంగా కారులో ఎక్కించుకుని వెళ్లిపోయారు. కుటుంబసభ్యులు అప్రమత్తం చేయడంతో ఎస్‌ఐ నారాయణ, సిబ్బంది వెంటనే రంగంలోకి దిగి గాలింపు చర్యలు చేపట్టారు.
నిందితులు పట్టుబడితే వారి చెర నుంచి యువతిని విడిపించి, తల్లిదండ్రులకు అప్పగిస్తామని ఎస్‌ఐ అన్నారు. లేకుంటే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని ఎస్‌ఐ తెలిపారు.
పెళ్లిని చెడగొట్టాలని.. లవర్‌కు కాబోయే భర్తను కిడ్నాప్ చేశాడు
CRPF Jawan : డబ్బు కోసం.. నిశ్చితార్ధం ఒకరితో… పెళ్లి మరోకరితో
Marriage Cancel: ప్రియురాలి పెళ్లి చెడగొట్టిన ప్రియుడు
Man Arrested : మాయమాటలు చెప్పి బాలికపై అత్యాచారం
Master kidnaped student : విద్యార్ధినిని కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకోవాలనుకున్న డ్రిల్ మాస్టార్
బులెట్ ఇస్తానని అపాచి బైక్ ఇస్తారా?..అంటూ ఊరేగింపులో బట్టలు విప్పేసి వరుడు హంగామా..పెళ్లి వద్దు పొమ్మన్న వధువు